Aryaveer Kohli : సాధారణంగా క్రికెట్ రంగంలో ప్రముఖ క్రికెటర్ల తో పాటు వారి వారసులు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే సచిన్ కుమారుడు, సెహ్వాగ్ కుమారుడు పలు లీగ్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇలా చెబుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. తాజాగా టీమిండియా కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ ఫ్యామిలీ నుంచి మరో క్రికెటర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతి త్వరలో ప్రారంభం కానున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్ జట్టు తరుపున బరిలోకి దిగనున్నాడు. అయితే అతను విరాట్ కోహ్లీ మాదిరిగా బ్యాటర్ కాదండోయ్.. అతను లెగ్ స్పిన్నర్ బౌలర్. ఇంతకు విరాట్ కోహ్లీ కి అతను ఏమవుతాడంటే..? వరుసకు కొడుకు అవుతాడు. విరాట్ అన్నయ్య వికాస్ కుమారుడే ఈ ఆర్యవీర్. ఇతడిని డీపీఎల్ 2025 వేలంలో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్ లక్షరూపాయలకు కొనుగోలు చేసింది. 15 ఏళ్ల ఈ యువకుడు భారత మాజీ క్రికెటర్ ప్రస్తుత SDS కోచ్ శరణ్ దీప్ సింగ్ వద్ద శిక్షణ తీసుకున్నాడు.
Also Read : Ravindra Jadeja: రేపు నైట్ వస్తావా? జడేజాకు లేడీ క్రికెటర్ బంపర్ ఆఫర్ ?
ఆర్యవీర్.. అప్ కమింగ్ స్టార్ : కోచ్ శరణ్ దీప్
కోచ్ శరణ్ దీప్ మాట్లాడుతూ.. ఆర్యవీర్ కోహ్లీ అప్ కమింగ్ స్టార్ అని.. అతను చాలా చిన్న వాడు. ఆర్యవీర్ ప్రతిభవంతమైన క్రికెటర్. ప్రాక్టీస్ లో చాలా కష్టపడుతున్నాడని తెలిపారు. ఆర్యవీర్ వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందాడు. అక్కడ కోచ్ రాజ్ కుమార్ శర్మ వద్ద కూడా శిక్షణ పొందాడు. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్ లో చేరడం వల్ల అతను ఐపీఎల్ స్టార్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠితో డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకుంటాడు. ఈ టీమ్ లో రాఠితో పాటు ఐపీఎల్ లో అదురగొడుతున్న పంజాబ్ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య వంటి ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియాలో ఐపీఎల్, డీపీఎల్ వంటి లీగ్ ద్వారా పరిచయం అయిన ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు.
జోరు కొనసాగిస్తున్న సూర్యవంశీ
ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ లాంటి ఆటగాడు 2025 సీజన్ ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతిపిన్న వయస్సులో ఇప్పటివరకు టీ-20లలో ఏ టీమిండియా క్రికెటర్ కి సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేశాడు. తక్కువ బంతుల్లో సెంచరీ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ అండర్ 19 యూత్ టెస్ట్ చెల్మ్స్ ఫోర్డ్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ 200 పరుగులు పూర్తి చేసుకునే అవకాశం కనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ యూత్ టెస్ట్ కెరీర్ లో 200 పరుగులకు చేరువలో ఉన్నాడు. ఇంగ్లాండ్ అండర్ -19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ టెస్టులో మొదటిలేదా రెండో ఇన్నింగ్స్ లో అతను 7 సిక్సర్లు కొడితే పెద్ద రికార్డును తన పేరిట నమోదు చేసుకుని రికార్డు క్రియేట్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇలా యంగ్ క్రికెటర్లు టీమిండియాకి ఎంట్రీ ఇచ్చి జోరు కొనసాగిస్తున్నారు. ఇంకా ముందు ముందు మరెంత మంది క్రికెటర్లు వస్తారో వేచి చూడాలి.