Asia Cup 2025 : ఆసియా కప్ 2025 ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లోనే తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ అప్గానిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ (Afghanistan Vs Hong Kong) జట్ల మధ్య జరుగనుంది. దాదాపు నెల రోజుల విరామం తరువాత టీమిండియా ఆటగాళ్లు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఇంగ్లాండ్ (England) తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ అనంతరం టీమిండియా ( Team India) ఆటగాళ్లు ఏ టోర్నీ ఆడలేదు. మరోవైపు బంగ్లాదేశ్ పర్యటన రద్దు కావడంతో భారత ఆటగాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటీవలే దుబాయ్ కి చేరుకొని ప్రాక్టీస్ చేశారు. ఈసారి ఆసియా కప్ (Asia Cup) టీ-20 ఫార్మాట్ లో జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. టీమిండియా ఫస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. ఆ తరువాత సెప్టెంబర్ 14న పాకిస్తాన్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
Also Read : Jacob Bethell : ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ కెరీర్ మార్చేసిన RCB… ఇక వీడి స్పీడు ఎవడు ఆపలేడు
ఇవాళ ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ అప్గానిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ (Afghanistan Vs Hong Kong) మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే పాకిస్తాన్ (Pakistan) తో జరిగే మ్యాచ్ కూడా రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే కేవలం సెప్టెంబర్ 15న ఒమన్ వర్సెస్ యూఏఈ (Oman Vs UAE) తో జరిగే మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్ లు అన్ని కూడా రాత్రి 8 గంటలకే ప్రారంభం కానున్నాయి. యూఏఈ వర్సెస్ ఒమన్ మధ్య జరిగే మ్యాచ్ సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానుంది. వాస్తవానికి ఆసియా కప్ టోర్నీ బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ ని సోనీ నెట్ వర్క్ దక్కించుకుంది. సోనీ టీవీ ఛానెల్స్ తో పాటు ఆ సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లైవ్ లో ఈ మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఇక నేరుగా ఈ ఛానెల్స్, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో చూడాలనుకుంటే రుసుము చెల్లించాలి. కానీ జియో యూజర్స్, ఎయిర్ టెల్ యూజర్స్, జియోటీవీ, ఎయిల్ టెల్ టీవీల సాయంతో ఈ మ్యాచ్ లను ఉచితంగా చూడవచ్చు. వాస్తవానికి ఈ మ్యాచ్ లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. యూఏఈ (UAE) లో ఎండలు తీవ్రంగా ఉండటం, ఉక్కపోత కారణంగా మ్యాచ్ లను అరగంట సమయాన్ని పొడగించారు. అందుకే రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
చివరిసారి ఆసియా కప్ 2023 లో వన్డే ఫార్మాట్ లో జరిగింది. ఆ టోర్నీలో భారత్ ఛాంపియన్ గా నిలిచింది. 2016లో మొదటిసారి టీ-20 ఫార్మాట్ లో నిర్వహించగా.. అప్పుడు కూడా భారత్ విజేతగా నిలిచింది. 2022లో టీ-20 ఫార్మాట్ లో నిర్వహించగా..భారత్ కనీసం ఫైనల్ కి అర్హత సాధించలేకపోయింది. ఆ టోర్నీలో శ్రీలంక (Srilanka) విజయం సాధించింది. తాజాగా భారత్ హాట్ పేవరేట్ గా బరిలోకి దిగుతున్నా.. టీ-20 ఫార్మాట్ లో ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. వాస్తవానికి సెప్టెంబర్ 14న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. తొలుత ఈ మ్యాచ్ జరుగుతుందా..? లేదా అనే డైలామా నెలకొంది. ఆ తరువాత బీసీసీఐ (BCCI) స్పందించి క్లారిటీ ఇచ్చింది. భారత ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. దీంతో ఈ మ్యాచ్ పై హైప్ క్రియేట్ అయింది. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లు కలిపి భారత్ 16 సార్లు తలపడితే.. ఆసియా కప్ (Asia Cup) లో భారత్ 8 టైటిళ్లను గెలిచింది. గ్రూప్ A లో భారత్ తో పాటు పాకిస్తాన్, యూఏఈ, ఓమన్ ఉన్నాయి. గ్రూపు B లో బంగ్లాదేశ్, అప్గానిస్తాన్, హాంగ్ కాంగ్, శ్రీలంకలు బరిలోకి దిగుతున్నాయి. ఒమన్ తొలిసారి ఆసియా కప్ ఆడనుండగా.. హాంకాంగ్ 2018, 2022 రెండుసార్లు, యూఏఈ 2016 ఒక్కసారి ఆడింది. ఈ సారి ఆసియా కప్ ఫైనల్ విజేత ఎవ్వరో తెలియాలంటే.. సెప్టెంబర్ 28 వరకు వేచి చూడాల్సిందే.
DETAILS ABOUT 2025 ASIA CUP IN UAE: pic.twitter.com/QbNZF6OnHZ
— RVCJ Sports (@RVCJ_Sports) September 8, 2025