E-Paper
Advertisement

Rohith Sharma: అభిమానులను వారించిన రోహిత్ శర్మ

Rohith Sharma: అభిమానులను వారించిన రోహిత్ శర్మ
Advertisement

Rohith Sharma

Pandya Gets Booed Again In Wankhede Rohit Comes For Support: ముంబై వాంఖేడి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రకరకాల సంఘటనలు జరిగాయి. మ్యాచ్ ఓడిపోవడం పక్కన పెడితే హద్దులు దాటిన అభిమానంపై కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ర్యాగింగ్ చేయవచ్చు కానీ, అది హద్దు దాటకూడదని అంటున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై ఒత్తిడి ఎంత ఉందో, అంతే ఒత్తిడి రోహిత్ శర్మపై కూడా ఉందని అంటున్నారు.

Advertisement

ఇంత జరుగుతున్నా సరే, రోహిత్ శర్మ తనకి సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. తనొక్క మాట చెబితే అభిమానులు కంట్రోల్ అవుతారు. కానీ తను ఆ మాట చెప్పడం లేదని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి. తనెందుకు చెప్పాలని కొందరు సీరియస్ అవుతున్నారు. అంతటి సీనియర్ ని, జాతీయ జట్టుకి నాయకత్వం వహిస్తున్న కెప్టెన్ ని, ఐదుసార్లు ట్రోఫీని అందించిన నాయకుడిని ఇలాగేనా సాగనంపేదని  సీరియస్ అవుతున్నారు.

హార్దిక్ ని తీసుకోవడం లో తప్పు లేదు, ఆ విషయం రోహిత్ శర్మతో చర్చించాలి. తనంగీకారంతోనే ముందుకు సాగాలి. సాఫ్ట్ వేర్ ఉద్యోగమా? సడన్ గా ఫైర్ అనడానికని అంటున్నారు. ఈ చర్చలు ఇలా సాగుతుండగా రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తున్నాడు.

Advertisement

Also Read: ‘భయపడ్డావా రోహిత్ భయ్యా’.. ఫ్యాన్‌ను చూసి ఉలిక్కిపడ్డ హిట్ మ్యాన్.. వీడియో వైరల్

గ్యాలరీ కి దగ్గరగా ఉన్న తనని చూసిన అభిమానులు మరింత రెచ్చిపోయారు. అప్పుడు రోహిత్ వారికి సైగలు చేస్తూ, కామ్ గా ఉండమని చెప్పడం విశేషం. దాంతో అభిమానులు శాంతించారు. అయితే టాస్ వేయడానికి పాండ్యా వెళ్లినప్పుడు అభిమానులు నిరసనలు వ్యక్తమవుతున్నా తను నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.

ఈ గందరగోళంలో ఒక అభిమాని గేటు దాటుకుని రోహిత్ వద్దకు పరిగెత్తాడు. సడన్ గా తనని పట్టుకున్నాడు. మళ్లీ సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అభిమానికి దేహశుద్ది చేసుకుంటూ తీసుకెళ్లారు.మరోవైపు నుంచి హార్దిక్ పాండ్యా వరుస ఓటములతో అతన్ని తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మనోజ్ తివారీ ఇదే మాట చెప్పడంతో డిమాండ్లు మరింత ఊపందుకున్నాయి.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×