BigTV English

Jadeja – Carse :  రన్ తీయకుండా ఇంగ్లాండ్ బౌలర్ కార్స్ కుట్రలు.. జడేజాను ఆపేసి మరి… ఇచ్చి పడేసిన జడ్డూ

Jadeja – Carse :  రన్ తీయకుండా ఇంగ్లాండ్ బౌలర్  కార్స్ కుట్రలు.. జడేజాను ఆపేసి మరి… ఇచ్చి పడేసిన జడ్డూ

Jadeja – Carse :  ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య లార్డ్స్ వేదికలో మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అంతకు ముందు రెండు టెస్టు మ్యాచ్ ల్లో తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడో టెస్ట్ మ్యాచ్ ప్రస్తుతం హోరా హోరీగా కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 192 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 193 పరుగుల లక్ష్యానికి బరిలోకి దిగిన టీమిండియా ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో పడిందనే చెప్పాలి. ప్రస్తుతం 39.3 ఓవర్లకు 112/8 స్కోర్ చేసింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులో ఉన్నారు. టీమిండియా బ్యాటర్లు యశస్వీ జైస్వాల్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 39, కరుణ్ నాయర్ 14, శుబ్ మన్ గిల్ 06, ఆకాశ్ దీప్ 01, రిషబ్ పంత్ 09, జడేజా ప్రస్తుతం 17 పరుగులు చేశాడు. బ్యాటింగ్ చేస్తున్నాడు.


Also Read : Team India: ఏంట్రా ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ.. మహిళల అవతారం ఎత్తారు ఏంటి

జడేజాను అడ్డుకున్న ఇంగ్లాండ్ బౌలర్.. 


అలాగే వాషింగ్టన్ సుందర్ డకౌట్ అయ్యాడు. నితీశ్ కుమార్ రెడ్డి 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.  ఈ క్రమంలోనే 36 ఓవర్ లో కార్సె బౌలింగ్ చేశాడు. జడేజా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రన్ తీస్తుండగా.. ఇంగ్లాండ్ బౌలర్ కార్సె జడేజాను అడ్డుకుంటాడు. అయినప్పటికీ జడేజా రెండు రన్స్ తీయడం విశేషం. రన్స్ తీశాక అలా ఎందుకు అడ్డుకున్నావని కార్సె వద్దకు వెళ్లి జడేజా అడుగుతుండగా.. తాను అడ్డుకోలేదని.. బంతి కోసం పరిగెత్తానని కార్సె సమాధానం చెబుతాడు. ఇక వీరి మధ్యలో బెన్ స్టోక్స్ వచ్చి ఇద్దరినీ సముదాయిస్తుంటాడు. మొత్తానికి ఇంగ్లాండ్.. భారత్ ఆటగాళ్ల మధ్య అగ్గివేస్తే భగ్గుమన్నట్టు ఉంది. ఒకరిపై ఒకరూ దూషణలు చేసుకోవడం.. విమర్శించుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తంతు జరగడం విశేషం.

జడేజా ఫినిష్ చేస్తాడా..? 

ఇంగ్లాండ్ బ్యాటర్ల విషయానికి వస్తే.. డకెట్ 12, పోప్ 04, క్రాలీ 22, రూట్ 40, బ్రూక్ 23, స్టోక్స్ 33, జెమ్మీ స్మిత్ 08, క్రిస్ వోక్స్ 10, కార్సె 01, ఆర్చర్ 05 నాటౌట్, బషీర్ 02 పరుగులు చేశారు. వాస్తవానికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలో ఇంగ్లాండ్ ఓపెనర్ కార్లే టైమ్ వేస్ట్ చేసాడు. బుమ్రా బౌలింగ్ వేస్తుండగా.. అప్పుడు వికెట్ల వద్ద నుంచి పక్కకు జరగడం.. ఆ తరువాత బంతి తాకిందని ఫిజియోథెరపిస్ట్ ను పిలిపించి.. రెండు, మూడు ఓవర్లు వేసే సమయంలో కేవలం ఒకే ఓవర్ వేసేలా చేశాడు. టీమిండియా కెప్టెన్ శుబ్ మన్ గిల్ క్రాలీ పై బండ బూతులు తిట్టడం.. క్రాలీకి ఫ**కింగ్ బంతులు వేయండి అని సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో అవి వివాదస్పదంగా మారాయి. ఇక ఇదిలా ఉంటే.. నిన్న ఇంగ్లాండ్ జట్టు 192 పరుగులకే ఆలౌట్ అయింది. రూట్ 40 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో కూడా రూట్ సెంచరీ చేసి టాప్ స్కోరర్ నిలవడం విశేషం. టీమిండియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో  కూడా పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోవడం విశేషం. టీమిండియా ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో పడింది. 86 పరుగులు చేయాల్సి ఉంది. బ్యాటర్ గా బుమ్రా వికెట్ పోకుండా కాపాడితే.. జడేజా ఫినిష్ చేస్తాడు. కానీ జడేజా, సిరాజ్ వికెట్లు కోల్పోతే టీమిండియా కి ఓటమి తప్పదు. ఏం జరుగుతుందో చూడాలి మరీ.

Related News

Neymar Junior : రూ.10వేల కోట్ల ఆస్తి.. ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చేసిన బిలియనీర్‌

Ross Taylor : రాస్ టేలర్ తో రెండు దేశాల తరఫున ఆడిన క్రికెటర్లు వీళ్లే… లిస్టు పెద్దదే

Timed Out In KCL 2025 : గ్రౌండ్ లో అడుగుపెట్టకుండానే ఔట్ అయిన బ్యాట్స్మెన్… అప్పట్లో KCL లో అరుదైన సంఘటన.. మాథ్యూస్ తరహాలోనే

Shreyas Iyer – BCCI: శ్రేయాస్ అయ్య‌ర్ కు అదిరిపోయే ఆఫ‌ర్‌..బీసీసీఐ ప్లాన్ అదుర్స్‌.. ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే

Asia Cup 2025: దుబాయ్ లో అడుగుపెట్టిన టీమిండియా…జెర్సీలో ఈ మార్పు గ‌మ‌నించారా

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Big Stories

×