
Aus Vs Ban | ఆస్ట్రేలియా రోజురోజుకి బలోపేతం అవుతోంది. ఒకొక్క బ్యాట్స్ మెన్ సెంచరీతో ఆగడం లేదు…అంతకుమించి చేస్తున్నారు. ఎంతపెద్ద లక్ష్యమైనా ఒంటి చేత్తో జట్టుని గెలిపిస్తున్నారు. మొన్న ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ విధ్వంసాన్ని చూస్తే, ఈరోజున బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో మిచెల్ మార్ష్ విజృంభణ ది కనిపించింది. 177 పరుగులు చేసి ఒంటి చేత్తో ఆస్ట్రేలియాను గెలిపించాడు.
మొదట బ్యాటింగ్ చేసి బంగ్లాదేశ్ నిర్దేశించిన 306 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్ల నష్టానికి 44.4 ఓవర్లలో ఆస్ట్రేలియా చేధించింది. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పుణెలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కి వచ్చిన బంగ్లాదేశ్ ఓపెనర్లు ఇద్దరూ జాగ్రత్తగానే ఆడారు. తంజిద్ హాసన్ (36), లిటన్ దాస్ (36) ఇద్దరూ చెరొక 36 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 11.2 ఓవర్ల తర్వాత 76 పరుగులకి మొదటి వికెట్ పడింది. తర్వాత మరో ఓపెనర్ 106 పరుగుల వద్ద అయిపోయాడు.
ఫస్ట్ డౌన్ వచ్చిన కెప్టెన్ హొస్సేన్ శాంటో (45) అవుట్ అయ్యాడు. తౌహిద్ హ్రిదయ్ 74 పరుగులు చేసి జట్టు 300 పరుగులు దాటించడంలో సహాయ పడ్డాడు. తర్వాత అందరూ బాధ్యతాయుతంగానే ఆడారు. మహ్మదుల్లా (32), ముస్తాఫిర్ రహీమ్ (21), మెహిది హాసన్ (29) చేసి జట్టు స్కోరుని 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా బౌలింగ్ లో సీన్ ఎబోట్ 2, ఆడమ్ జంపా 2, స్టోనిస్ ఒక వికెట్ తీసుకున్నారు.
లక్ష్యచేధనకు వచ్చిన ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ కొట్టి పారేసింది. ఆఫ్గానిస్తాన్ తో జరిగిన పరాభవాన్ని గుర్తు పెట్టుకుని బంగ్లాదేశ్ ని చిన్న జట్టే కదాని తేలికగా చూడలేదు. వళ్లు దగ్గర పెట్టుకుని ఆడారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (10) మూడో ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (53) ఆఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు.
ఫస్ట్ డౌన్ వచ్చిన మిచెల్ మార్ష్ అద్భుతమైన సెంచరీని మించి చేశాడు. 9 సిక్సులు 17 ఫోర్లతో 132 బంతుల్లో 177 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ (63 నాటౌట్ ) కలిసి 44.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించారు. సెమీస్ పోరుకి సిద్ధమయ్యారు. బంగ్లాదేశ్ 8వ స్థానంతో సరిపెట్టుకుంది. శ్రీలంక కన్నా ఒక మెట్టు పైనే నిలిచింది.
బంగ్లా బౌలింగ్ లో తస్కిన్ అహ్మద్, రహ్మాన్ చెరో వికెట్ తీశారు.
AFG vs AUS : ఆ క్యాచ్.. కొంప ముంచింది: ఆఫ్గాన్ కెప్టెన్