Mohammed Siraj wicket: ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా జరిగిన 3వ టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూడవ టెస్టులో భారత జట్టు 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 170 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో టీమిండియా స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.
Also Read: Ravindra Jadeja: వీరుడిలా రవీంద్ర జడేజా రెచ్చిపోవడానికి కారణం ఇదే.. బ్యాట్ పై అవి పెట్టుకుని మరి
ఒకానొక సమయంలో 112 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయి గడుస్థితిలో ఉన్న నేపథ్యంలో.. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వీరోచితంగా పోరాడాడు. మరో ఎండ్ లో అతడికి బుమ్రా, మహమ్మద్ సిరాజ్ కూడా అండగా నిలిచారు. అయితే చివరి సెషన్ ఆరంభంలోనే విజయానికి 22 పరుగుల దూరంలో భారత్ అద్వితీయ సమరానికి చెక్ పడింది.
సిరాజ్ ఔట్:
భారత్ విజయానికి ఇంకా 24 పరుగులు అవసరం ఉన్న సమయంలో.. మహమ్మద్ సిరాజ్ అప్పటికే క్రీజ్ లో పాతుకుపోవడంతో.. రవీంద్ర జడేజా నమ్మకంతో మహమ్మద్ సిరాజ్ కి సింగిల్ తీసి ఇచ్చాడు. స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్ లో బౌన్స్ అయిన బంతిని.. సిరాజ్ బ్యాక్ పుట్ తీసుకుని డిఫెండ్ చేశాడు. బంతి నెమ్మదిగా సిరాజ్ పక్కనుండి వెళ్లి స్టంప్స్ ని గిరాటేసింది. ఇంకేముంది.. బెయిల్ కింద పడిపోయింది.
ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్ అవుట్ కాగా.. ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. మరోవైపు సిరాజ్ కూడా దిగ్భ్రాంతికి గురయ్యాడు. సిరాజ్ అవుట్ {Mohammed Siraj wicket} కావడంతో కోట్లాదిమంది భారతీయులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మహమ్మద్ సిరాజ్ కూడా మైదానంలోనే ఏడ్చాడు. ఇక సిరాజ్ గ్రౌండ్ లో తీవ్రంగా బాధపడుతున్న సమయంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్.. సిరాజ్ వద్దకు వెళ్లి కౌగిలించుకొని ఓదార్చాడు. ఒకవేళ సిరాజ్ అవుట్ కాకుండా ఉంటుంటే ఫలితం మరోలా ఉండేదేమో.
కెమెరామెన్ కంటతడి:
ఇక అవుట్ అయిన {Mohammed Siraj wicket} క్రమంలో సిరాజ్ మియా తీవ్ర నిరాశతో అక్కడే కూర్చున్నాడు. బరువెక్కిన హృదయంతో ఎమోషనల్ అయిపోయాడు. ఈ క్రమంలో వీడియో తీస్తున్న ఓ కెమెరామెన్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. ఆ కెమెరామెన్ భావోద్వేగానికి గురైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు.. సిరాజ్ ఆడిన డిఫెన్స్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండి పోతుందని, బౌన్సర్లు బుల్లెట్లలా దూసుకువచ్చి బాడీకి తాకుతున్నప్పటికీ చెక్కుచెదరకుండా, ఏకాగ్రత కోల్పోకుండా బ్యాటింగ్ చేశాడని.. ఇంగ్లాండ్ బౌలర్లను సిరాజ్ మియా విసిగించాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది నెటిజెన్లు మాత్రం.. క్రికెట్ అంటేనే ఓ ఎమోషన్ అని, మిగిలిన రెండు మ్యాచ్లలో టీమ్ ఇండియా గెలుపొందుతుందని కామెంట్స్ చేస్తున్నారు.