BigTV English

Pakistan U19 vs Australia U19: ఉత్కంఠ పోరులో ఆసీస్ విజయం.. ఫైనల్లో ఇండియాతో అమీతుమీ!

Pakistan U19 vs Australia U19: ఉత్కంఠ పోరులో ఆసీస్ విజయం.. ఫైనల్లో ఇండియాతో అమీతుమీ!
Pakistan U19 vs Australia U19

Pakistan U19 Vs Australia U19 Semifinal Match: అండర్ 19 వరల్డ్ కప్‌ ఫైనల్‌లో భారత్ తో తలపడే జట్టేదో తేలిపోయింది. భారత్ తో ఆసీస్ ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది. 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. ఆసీస్ 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఒక దశలో కంగారూలను పాక్ బౌలర్లు కంగారు పెట్టించారు. 164 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో టార్గెట్ ఛేజ్ చేసింది. 6 బంతుల్లో 3 పరుగులు చేయాల్సి ఉండగా మెక్‌మిలాన్ ఫోర్ కొట్టి విజయ డంఖా మోగించాడు.


బెనోనిలో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 48.5 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాక్ ఆటగాళ్లలో అజాన్ (52, 91 బంతుల్లో), అరాఫత్ (52, 61 బంతుల్లో) అర్థ సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్ టామ్ స్ట్రేకర్ 6 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. మహ్లీ, విడ్లెర్, మెక్‌మిలాన్, క్యాంప్ బెల్ తలో వికెట్ తీసుకున్నారు.

180 పరుగుల లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన ఆసీస్ జట్టు ఓపెనర్ హ్యారీ డిక్సన్ (50, 75 బంతుల్లో) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాక్ బౌలర్ అలీ రాజా నాలుగు వికెట్ల తీసుకున్నాడు. 59 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను ఓలీవర్ పీక్(49, 75 బంతుల్లో), ఓపెనర్ డిక్సన్ ఆదుకున్నారు.


Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×