BigTV English
Advertisement

AFG Vs AUS T20 WC 2024 Highlights: సూపర్ 8లో పాట్ కమిన్స్‌ రెండో హ్యాట్రిక్‌.. ఆసిస్ ను చిత్తు చేసిన అఫ్గానిస్థాన్‌!

AFG Vs AUS T20 WC 2024 Highlights: సూపర్ 8లో పాట్ కమిన్స్‌ రెండో హ్యాట్రిక్‌.. ఆసిస్ ను చిత్తు చేసిన అఫ్గానిస్థాన్‌!

Australia vs Afghanistan Highlights T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో మరో సంచలనం నమోదైంది. సూపర్ 8 పోరులో ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో ఆఫ్గనిస్తాన్ సంచలన విజయం నమోదు చేసి.. టీ 20 ప్రపంచకప్ ను ఒక్కసారి షేక్ చేసింది. 2023 వన్డే వరల్డ్ కప్ లో జరిగిన పరాభావానికి బదులు తీర్చుకుంది.


అయితే బంగ్లాదేశ్ కూడా ఇక్కడ అద్భుతంగా ఏమీ ఆడలేదు. వాళ్లు 148 పరుగులు మాత్రమే చేశారు. ఆస్ట్రేలియాలాంటి పెద్ద జట్టుకి ఇది పెద్ద సమస్య కాదు. బహుశా 10 ఓవర్లలో కొట్టేద్దామని అనుకున్నారో ఏమో తెలీదు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఒక్కసారిగా చతికిల పడింది.

బంగ్లా బౌలర్ గుల్బదిన్ నయిబ్, నవీన్ ఉల్ హక్ ధాటికి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ విలవిల్లాడింది. చివరి వరకు కోలుకోలేకపోయింది. ఎట్టకేలకు ఆఫ్గాన్ ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందడుగు వేసింది. సెమీస్ రేస్ లోకి వచ్చింది. ఇప్పుడిది టీమ్ ఇండియాకి సంకటంగా మారనుంది.


Also Read: ఎన్ని హాఫ్ సెంచరీలు చేశామన్నది కాదు.. గెలిచామా? లేదా? : రోహిత్ శర్మ

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

వివరాల్లోకి వెళితే…149 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. బలమైన ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (0), డేవిడ్ వార్నర్ (3) వెంట వెంటనే అవుట్ అయిపోయారు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఆడాల్సిన ఆస్ట్రేలియాకి మరో దెబ్బ తగిలింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (12) తను అవుట్ అయిపోయాడు.

Also Read: IND vs AUS T20 World Cup 2024 Preview: హోరాహోరీ పోరు తప్పదా?.. నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్

పవర్ ప్లే ముగియక ముందే 5.1 ఓవర్లలో 32 పరుగులకి 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.  ఈ సమయంలో వచ్చిన గ్లెన్ మ్యాక్స్ వెల్ ఆదుకున్నాడు. ఇన్నాళ్లూ ఫామ్ కోల్పోయి సతమతమయ్యే తను మళ్లీ ఈ మ్యాచ్ లో రిథమ్ లోకి వచ్చాడు.

ఆరోజున 2023 వన్డే వరల్డ్ కప్ లో మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఆరోజున ఆఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను డబుల్ సెంచరీ చేసి ఒంటిచేత్తో మ్యాక్స్ వెల్ గెలిపించాడు. ఇప్పుడు కూడా దాదాపు గెలిపించినంత పనిచేశాడు. 41 బంతుల్లో 3 సిక్స్ లు, 6 ఫోర్ల సాయంతో 59 పరుగులు చేశాడు. కానీ గులాబిదిన్ ధాటికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 106 పరుగుల వద్ద 6వ వికెట్ గా తను వెనుతిరిగాడు.

Also Read: South Africa vs West Indies: వెస్టిండీస్‌కు షాక్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన సౌతాఫ్రికా..

అప్పటికి మ్యాచ్ ఇంకా ఆస్ట్రేలియా చేతిలోనే ఉంది. ఎలాగంటే 32 బంతుల్లో 43 పరుగులు చేయాలి. చేతిలో ఇంకా 4 వికెట్లు ఉన్నాయి. కమిన్స్ ఉన్నాడు. కానీ ఆఫ్గాన్లు పట్టు బిగించేశారు. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్‌ (3/28) టీ20 ప్రపంచ కప్‌ 2024లో వరుసగా రెండో హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. పిచ్ నుంచి అందుతున్న సహకారంతో అద్భుతంగా బౌలింగ్ చేసి నాడు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నారు. మొత్తానికి మిగిలిన వికెట్లు కూడా తీసి ఘన విజయం సాధించారు.

మ్యాక్స్ వెల్ తర్వాత ఎవరూ పెద్దగా ఆడలేదు. మథ్యూ వేడ్ (5), పాట్ కమిన్స్ (3), ఆస్టన్ (2), ఆడమ్ జంపా (9), జోష్ హాజిల్ వుడ్ (5 నాటౌట్) ఇలా చేయడంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 127 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దీంతో 21 పరుగుల తేడాతో ఆఫ్గనిస్తాన్ ఘన విజయం సాధించింది.

ఆఫ్గాన్ బౌలింగులో గులాబదిన్ 4, నవీన్ ఉల్ హక్ 3, రషీద్ 1, ఒమర్ జాయ్ 1, మహ్మద్ నబీ 1 వికెట్ పడగొట్టారు.

Also Read: IND vs AUS T20 WC 2024 Weather Update: నేటి మ్యాచ్ కి వర్షం ఆటంకం? ఆసిస్ కి గుబులు.. ఇండియాకి దిగులు

అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్గాన్లకు ఓపెనర్లు ఇద్దరూ శుభారంభాన్ని అందించారు. దాదాపు 16 ఓవర్ల వరకు వారిద్దరే ఆడారు. గుర్బాజ్ 49 బంతుల్లో 4 సిక్స్ లు, 4 ఫోర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. ఇబ్రహీం జర్దాన్ 48 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు.

పిచ్ నుంచి సహకారం లేకపోవడంతో జాగ్రత్తగా ఆడుతూ స్కోరుని పెంచుకుంటూ వెళ్లారు. 15.5 ఓవర్లలో 118 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. తర్వాత అందరూ స్కోరు పెంచే క్రమంలో త్వరత్వరగా అయిపోయారు. ఒమర్ జాయ్ (2), కరిమ్ జనత్ (13), రషీద్ ఖాన్ (2), నబీ (0), మహ్మద్ నబీ (10 నాటౌట్) ఖరోటే (1 నాటౌట్) ఇలా చేశారు. మొత్తానికి స్కోరుని 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగుల వరకు తీసుకువెళ్లారు.

Also Read: హార్దిక్ ఆల్ రౌండ్ షో.. బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం..సెమీస్‌లోకి!

ఆస్ట్రేలియా బౌలింగులో కమిన్స్ 3, ఆడమ్ జంపా 2, మార్కస్ స్టోనిస్ 1 వికెట్ పడగొట్టారు.

ఈ గెలుపుతో గ్రూప్ 1 పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ చెరో రెండు పాయింట్లతో ఉన్నాయి. భారత్ మాత్రం 4 పాయింట్లతో ఉంది. ఇప్పుడు రేపు జరగనున్న ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మ్యాచ్ రెండు జట్లకి కీలకంగా మారనుంది.

Tags

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×