Axar Patel: ఇండియా ( Team India) అలాగే పాకిస్తాన్ (Pakistan ) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. పహల్గాం సంఘటన అనంతరం ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత చెడిపోయాయి. మ్యాచ్ లు జరిగితే షేక్ హ్యాండ్ లు కూడా ఇచ్చుకోవడం లేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లను బాపు అక్షర్ పటేల్ ( Axar Patel) దారుణంగా అవమానించాడు. పాకిస్తాన్ పరువు తీసేలా వ్యవహరించాడు. పాకిస్తాన్ ప్లేయర్లకు ప్రాక్టీస్ చేతకాదంటూ హేళన చేశాడు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న అక్షర్ పటేల్… పాకిస్తాన్ ప్లేయర్లను ర్యాగింగ్ చేశాడు. ముఖ్యంగా బాబర్ ఆజం ( Babar Azam) ఇండియాతో మ్యాచ్ సందర్భంగా వికెట్ కోల్పోయిన అంశంపై సెటైర్లు పేల్చారు. వాడిపై ఎంత తక్కువ కామెంట్ చేస్తే, అంత మంచిది అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు అక్షర్ పటేల్. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ వీడియో వైరల్ గా మారింది.
Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది
పాకిస్తాన్ క్రికెటర్ల వ్యవహారంపై టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel ) దారుణంగా ట్రోలింగ్ చేశాడు. ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న అక్షర్ పటేల్, పాకిస్తాన్ తో మ్యాచ్ లు, వాళ్ల వ్యవహారంపై కీలక విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా బాబర్ ఆజం (babar azam) టీమిండియా చేతిలో ఔట్ అయిన విధానంపై ట్రోల్ చేశారు. గతంలో ఇండియా చేతిలో బాబర్ ఆజం, స్లిప్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ క్లిప్ ను యాంకర్ ప్రదర్శించాడు. ఇక దాన్ని చూసిన అక్షర్ పటేల్ ర్యాగింగ్ చేశాడు. ఆ మ్యాచ్ కంటే ముందు ప్రాక్టీస్ లో స్లిప్పు లో బాబర్ ఆజం వికెట్ సమర్పించుకున్నాడని… అచ్చం అలాగే టీమిండియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా వికెట్ ఇచ్చేసుకున్నట్లు అక్షర్ పటేల్ కామెంట్ చేశాడు.
వీళ్లకు ప్రాక్టీస్ చేయడం చేతకాదని… అందువల్లే మ్యాచ్ లో ఆడేటప్పుడు వికెట్లు సమర్పించుకుంటారని చురకలు అంటించారు. ఇలాంటి పాకిస్తాన్ ప్లేయర్లకు అనవసరంగా ఇంగ్లీష్ క్లాసులు నిర్వహిస్తున్నారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరువు తీశారు. ముందుగా వాళ్లకు బ్యాటింగ్ చేయడం నేర్పించండి అని సలహాలు ఇచ్చారు. లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ జట్టును కాపాడడం ఎవరి తరం కాదంటూ హేళన చేశారు. టీమిండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు ఆడినా.. వాళ్ళు ఓడిపోవడం గ్యారంటీ అని సెటైర్లు పేల్చారు. గత ఐదు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు అక్షర్ పటేల్. భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ క్రికెట్ జట్టు నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. నా దృష్టిలో పాకిస్తాన్ చిన్న జట్టని… వాళ్ల గురించి తక్కువ మాట్లాడితే బెటర్ అన్నారు.
Axar Patel give reaction on babar azam & Pakistan team practice memes 🤣 pic.twitter.com/D5bs5OHmuI
— Sam (@cricsam02) July 3, 2026