E-Paper

అమర్‌నాథ్ యాత్రకు వెళుతున్నారా? ఈ అందమైన ప్రదేశాలు తప్పక చూడండి

అమర్‌నాథ్ యాత్రకు వెళుతున్నారా? ఈ అందమైన ప్రదేశాలు తప్పక చూడండి
Advertisement

అమర్‌నాథ్ యాత్ర భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు జమ్మూ కాశ్మీర్‌లోని పవిత్ర అమర్‌నాథ్ గుహను సందర్శించి భోళా శంకరుని దర్శనం చేసుకుంటారు. మీరు కూడా ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలని అనుకుంటే గుహలో ఈశ్వరుని దర్శనంతో పాటు మార్గమధ్యంలో ఉన్న కొన్ని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించండి. ఈ ప్రాంతాల్లో ప్రకృతి అందాలు మీ యాత్రను మరింత ప్రత్యేకంగా చేస్తాయి.

పహల్గామ్.. ప్రశాంతమైన బేస్ క్యాంప్

అమర్‌నాథ్ యాత్రకు ప్రధాన బేస్ క్యాంప్‌గా పహల్గామ్ ప్రసిద్ధి చెందింది. మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని పచ్చిక బయళ్లు, లిద్దర్ నది ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం యాత్రికులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రఫీ ఇష్టపడేవారికి ఇది అద్భుతమైన ప్రదేశం.

సోనమార్గ్.. బంగారు మైదానం

Advertisement

సోనమార్గ్‌ను “బంగారు మైదానం” అని కూడా పిలుస్తారు. మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు, అందమైన లోయలు, భారీ మంచు గడ్డలు ఈ ప్రాంతాన్ని ఎంతో ఆకర్షణీయంగా మారుస్తాయి. ఇక్కడి నుంచి అనేక ట్రెక్కింగ్ మార్గాలు ప్రారంభమవుతాయి. వాతావరణం అనుకూలంగా ఉంటే స్వర్గాన్ని తలపించే అందాలను ఆస్వాదించవచ్చు.

శ్రీనగర్.. కాశ్మీర్ గుండె

సమయం ఉంటే శ్రీనగర్‌ను తప్పకుండా సందర్శించాలి. ఇక్కడి ప్రసిద్ధ డల్ సరస్సులో శికారా పడవ ప్రయాణం పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తుంది. మొఘల్ గార్డెన్స్ అందమైన పూలతో సందర్శకులను ఆకట్టుకుంటాయి. స్థానిక మార్కెట్లలో కాశ్మీరీ హస్తకళలు, డ్రై ఫ్రూట్స్, స్మారక వస్తువులు కొనుగోలు చేయవచ్చు.

చందన్‌వారీ.. సంప్రదాయ యాత్ర ప్రారంభ స్థలం

Advertisement

చందన్‌వారీ అమర్‌నాథ్ సంప్రదాయ యాత్రలో ముఖ్యమైన దశ. చాలా మంది భక్తులు ఇక్కడి నుంచే కాలినడక యాత్రను ప్రారంభిస్తారు. చుట్టూ మంచుతో కప్పబడిన కొండలు, చల్లని వాతావరణం ఈ ప్రాంతాన్ని మరింత అందంగా మారుస్తాయి. ప్రకృతి మధ్యలో ఆధ్యాత్మిక అనుభూతిని పొందేందుకు ఇది మంచి ప్రదేశం.

బాల్టాల్.. అమర్‌నాథ్ గుహకు షార్ట్ కట్

తక్కువ సమయంలో యాత్ర పూర్తి చేయాలనుకునే భక్తులకు బాల్టాల్ మార్గం అనువైనది. ఈ మార్గం ద్వారా అమర్‌నాథ్ గుహకు త్వరగా చేరుకోవచ్చు. చుట్టూ కనిపించే పర్వతాలు, పచ్చని లోయలు, స్వచ్ఛమైన గాలి యాత్రను మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి.

Also Read: దేశంలోనే మోస్ట్ ఫేవరెట్ ట్రెక్కింగ్ డెస్టినేషన్.. ఆ గ్రామంలో బారులు తీరుతున్న ట్రెక్కర్లు

యాత్రలో తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు

యాత్రకు వెళ్లే ముందు పూర్తి ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలి. అధికారికంగా నమోదు చేసుకున్న తర్వాతే యాత్ర ప్రారంభించాలి. ప్రభుత్వం, భద్రతా సిబ్బంది సూచించిన అన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. వెచ్చని దుస్తులు, రెయిన్‌కోట్, అవసరమైన మందులు, గుర్తింపు కార్డులను వెంట తీసుకెళ్లాలి. ఎత్తైన ప్రాంతాల్లో నెమ్మదిగా నడవాలి. తరచూ నీరు తాగుతూ శరీరంలో నీటి లోపం రాకుండా చూసుకోవాలి. వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉండటంతో తాజా వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటూ ప్రయాణించాలి.

Related News

గంగానది మధ్యలో ప్రకృతి సోయగాలు.. పర్యాటకుల కోసం కహల్‌గావ్ దీవి ఓపెన్

వర్షాకాలంలో ఈ హిల్ స్టేషన్లకు అసలు వెళ్లకూడదు.. ప్రాణాలకు ప్రమాదం

ఏంటీ.. విమానంలో టర్కీ కోడి డిన్నరా? 1949లో లగ్జరీ ఏ స్థాయిలో ఉండేదో తెలుసా?

శివభక్తులకు గుడ్ న్యూస్.. నేటి నుంచే అమర్‌నాథ్ మహాయాత్ర ప్రారంభం.. రూట్ మ్యాప్ ఇదే!

ఎయిర్ ఇండియా ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక చౌకగా విదేశీ ప్రయాణం!

వందే భారత్ సహా 12 రైళ్ల రూట్ ఛేంజ్.. మీరు వెళ్లే ట్రైన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి!

ఒక్క టికెట్‌ తో అయోధ్య, కాశీ, పూరీ దర్శనం.. IRCTC బంపర్ ఆఫర్!

Big Stories

×