India vs Oman: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ తీవ్రంగా గాయపడ్డాడు. టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తలకు గాయమైంది. దీంతో అతను మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా నిన్న ఒమన్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన సంఘటన తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలోనే అక్షర్ పటేల్ తలకు తీవ్రమైన గాయమైంది. ఫీలింగ్ చేస్తున్న సమయంలో.. బంతిని అందుకో బోయి… కింద పడిపోయాడు. ఈ నేపథ్యంలోనే అక్షర్ పటేల్ తలకు తీవ్రమైన గాయమైంది. తల పట్టుకొని విలవిలలాడిపోయాడు. గ్రౌండ్ లోనే.. పడిపోయిన అక్షర్ పటేల్ ను.. వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…. టీమిండియా అభిమానులు షాక్ అవుతున్నారు.
ఒమన్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్ లో తీవ్రంగా గాయపడిన అక్షర్ పటేల్ ఈ సిరీస్ నుంచి తప్పుకునే ప్రమాదం వచ్చింది. అతని తలకు తీవ్రమైన గాయం కావడంతో… టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కు దూరంగా కాబోతున్నాడని అంటున్నారు. రేపే మ్యాచ్ ఉన్న తరుణంలోనే… అక్షర్ పటేల్ దూరం అవుతాడని అంటున్నారు. అబిదాబీలోని ఓ ఆస్పత్రిలో అక్షర్ పటేల్ కు ట్రీట్ మెంట్ అందిస్తున్నారట. ఒకవేళ ఆయన కోలుకుంటే… సూపర్ 4 లో పాకిస్థాన్ మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్ లు ఆడతారని చెబుతున్నారు. ఒకవేళ గాయం పెద్దది అయితే…ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నుంచి తప్పుకునే ప్రమాదం వచ్చింది. దీంతో టీమిండియా అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
Also Read: Asia Cup 2025 : పప్పులో కాలు వేసిన రషీద్ ఖాన్… అది ఔట్ రా బాబు అంటూ పరువు తీసిన అంపైర్
Axar Patel drops a catch and takes a blow to the head on the ground. 🤕
Hoping he’s okay!#India #Oman #INDvsOMN #AsiaCup #MrCricketUAE pic.twitter.com/vQtnrzv2Mo
— Mr. Cricket UAE (@mrcricketuae) September 19, 2025