Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో భాగంగా అప్గానిస్తాన్ వర్సెస్ శ్రీలంక లీగ్ దశలో మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు అప్గానిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక విజయం సాధించినప్పటికీ ఈ మ్యాచ్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో ముఖ్యంగా అప్గానిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ.. శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లలాగే బౌలింగ్ లో వరుసగా 5 సిక్స్ లు బాదాడు. దీంతో అత్యధిక సిక్స్ లు బాదిన ఆటగాడిగా ఈ మ్యాచ్ లో మహ్మద్ నబీ అవార్డు కూడా అందుకున్నాడు. ఒకే ఓవర్ లో 5 సిక్స్ లు కొట్టాడు. కొద్దిలోనే యువరాజ్ సింగ్ రికార్డును సమం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. చివరి బంతికి కనుక సిక్స్ కొట్టుంటే నబీ కూడా యువరాజ్ లో 6 బంతుల్లో 6 సిక్స్ లు కొట్టేవాడు. కానీ చివరి బంతిలో 2 పరుగులు తీసేందుకు ప్రయత్నించి రన్ ఔట్ అయ్యాడు నబీ.
Also Read : IND Vs OMAN : టాస్ గెలిచిన టీమిండియా.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..?
ఇదిలా ఉంటే.. అప్గానిస్తాన్ బ్యాటర్ రషీద్ ఖాన్ బ్యాటింగ్ చేసే క్రమంలో నువాన్ తుషార బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే దానిని రషీద్ ఖాన్ ఎల్బీడబ్ల్యూ అనుకొని రివ్యూ కోరాడు. దీంతో అంపైర్ అది ఔట్ రా బాబు అంటూ చేతితో ఇలా సైగ చేశాడు. అయినప్పటికీ రషీద్ ఖాన్ రివ్యూ తీసుకున్నాడు. దీంతో శ్రీలంక బౌలర్ నువాన్ తుషార నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శ్రీలంక వర్సెస్ అప్గాన్ మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో శ్రీలంక జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గ్రూపు లో మూడు విజయాలతో శ్రీలంక ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. రెండు విజయాలతో బంగ్లాదేశ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. దీంతో అప్గానిస్తాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
సూపర్ -4 కి అర్హత చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అప్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ముఖ్యంగా అప్గానిస్తాన్ బ్యాటర్ మహ్మద్ నబి 22 బంతుల్లో 60 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వెల్లలాగే వేసిన చివరి ఓవర్ లో నబీ ఏకంగా 5 సిక్స్ లు కొట్టడం బాదడం విశేషం. ఈ ఓవర్లలో అతను వరుసగా6, 6,6, నోబాల్, 6, 6 బాదాడు. ఇతర బ్యాటర్లలో రషీద్ ఖాన్ (24), ఇబ్రహీమ్ జద్రాన్ (24) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం శ్రీలంక 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ 52 బంతుల్లో 74 నాటౌట్. అర్థ సెంచరీతో జట్టును గెలిపించగా.. కుశాల్ పెరీరా(28), కమిందు మెండిస్ (26) రాణించారు. దీంతో శ్రీలంక విజయం సాధించింది.
AFG CAPTAIN RASHID KHAN TAKING REVIEW AFTER GETTING CLEAN BOWLED 🤦♂️😂
SECOND BEST ASIAN TEAM FOR A REASON 🥴🔥#AFGvSL #AsiaCup pic.twitter.com/RMHCNsD4Io— Amir (@khano_3) September 18, 2025