BigTV English

Rohit Sharma : ఆస్ట్రేలియా జెర్సీలో రోహిత్ శర్మ.. క్రేజీ ఫోటో వైరల్.. 90 కిలోలు పెరిగిపోయాడు ఏంటి

Rohit Sharma : ఆస్ట్రేలియా జెర్సీలో  రోహిత్ శర్మ.. క్రేజీ ఫోటో వైరల్.. 90 కిలోలు పెరిగిపోయాడు ఏంటి

Rohit Sharma :  ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లార్డ్స్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదటి రోజు ఏకంగా 14 వికెట్లు కుప్ప కూలడం విశేషం. దక్షిణాఫ్రికా బౌలర్ రబాడ సూపర్ బౌలింగ్ తో ఆస్ట్రేలియా 212 పరుగులకే కుప్పకూలింది. రబాడ 5/51, యాన్సెన్ 3/49 అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 66, వెబ్ స్టర్ 72 పరుగుల మినహా మిగతా బ్యాటర్లు ఎవ్వరూ అంతగా రాణించలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ జరుగుతున్న లార్డ్స్ వేదిక వద్దకు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ వెళ్లాడు. ఆస్ట్రేలియా జట్టు కి తన మద్దతు తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read : Gukesh Visits tirumala : గుకేష్ వరుస విజయాల వెనుక రహస్య దేవుడు.. ఇదిగో ఇదే ప్రూఫ్

మరోవైపు టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వీరికి ఘనంగా సన్మానం చేయనున్నట్టు సమాచారం.  అందుకే రోహిత్ శర్మ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఆస్ట్రేలియా కి మద్దతు తెలపడం విశేషం. ఈ ఫోటోలో రోహిత్ శర్మ ఓవర్ వెయిట్ లా కనిపిస్తున్నాడు. దాదాపు 90 కేజీల బరువు పెరిగిపోయాడేంటి..? అని ట్రోలింగ్స్ చేయడం విశేషం.  ఇందుకు సంంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వాస్తవానికి ఇవి ఒరిజినల్ ఫోటో లు కాదండోయ్..  AI టెక్నాలజీతో క్రియేట్ చేసిన ఫోటోలు ఈ ఫోటోలను చూసి కొంత మంది నెటిజన్లు రోహిత్ శర్మ ఇంత లావుగా తయారయ్యాడేంటి అని పేర్కొంటున్నారు. ఈ ఫోటోలపై రకరకాలుగా కామెంట్స్ చేయడం విశేషం. మరోవవైపు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన దక్షిణాఫ్రికా తడబడింది.


తడబడ్డ దక్షిణాఫ్రికా..

తొలి రోజు ఆట ముగిసే సమయానికి 43 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది. బవుమా (3), బెడింగ్ హామ్ (8) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా దే పై చేయి లా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆధిక్యం సాధించడం  కష్టంతో కూడుకున్న పనే. వాస్తవానికి ఆస్ట్రేలియా ను తక్కువ స్కోర్ కే ఆలౌట్ చేసినా.. సౌతాఫ్రికా తొలి రోజును నిరాశగానే ముగించింది. బ్యాటింగ్ లో దక్షిణాఫ్రికా కంగారుల కంటే ఎక్కువగానే తడబడింది. ఓపెనర్లు ఇద్దరినీ ఔట్ చేయడం ద్వారా ఆ జట్టును స్టార్క్ గట్టి దెబ్బ తీశాడు. తొలి ఓవర్ లోనే అద్భుతమైన ఇన్ స్వింగ్ డెలివరీతో మార్ క్రమ్ ను బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటి తరువాత మరో ఓపెనర్ రికెల్టన్ ని కూడా వెనక్కి పంపించాడు. రికిల్టన్ 16 పరుగులు చేశాడు. ముల్డర్ ను కమిన్స్, స్టబ్స్ ను హేజిల్ వుడ్ ఔట్ చేయడంతో సౌతాఫ్రికా 30/4 తో కష్టాల్లో కూరుకుపోయింది. వికెట్ పడకుండా కెప్టెన్ బవుమా, బెడింగ్ హమ్ తొలి రోజును ముగించారు.

Related News

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

Big Stories

×