BigTV English

IPL 2025: ఐపీఎల్‌ ఫాన్స్ కు షాక్.. తొలి మ్యాచ్‌ రద్దు?

IPL 2025: ఐపీఎల్‌ ఫాన్స్ కు షాక్.. తొలి మ్యాచ్‌ రద్దు?

IPL 2025:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు ( Indian Premier League 2025 Tournament ) కౌంట్ డౌన్ షురూ అయింది. మరికొన్ని గంటల్లోనే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మార్చి 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగుతుంది. దీనికోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India )… ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసేసింది. దేశంలోని 13 చోట్ల ఓపెనింగ్ సెర్మనీలకు కూడా ఏర్పాట్లు చేశారు. ఈ ఓపెనింగ్ సెర్మని కి… బాలీవుడ్ తారలు అలాగే…. ప్రముఖులు హాజరు కాబోతున్నారు.


Also Read: SRH – Travis Head: SRHను చూస్తేనే వణకు పుట్టాల్సిందే…ఈ సారి 400 కొట్టడం పక్కా…?

ఇక మార్చి 22వ తేదీన… ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ప్రారంభ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య… జరగబోతుంది. సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా… కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైట్ ఉంటుంది. దీంతో ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు కూడా సేల్ అయిపోయాయి.


ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ కు.. పెను ప్రమాదం వచ్చి పడింది. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేలా వరుణుడు… విలన్ గా మారాడు. మార్చి 22వ తేదీన కోల్కతాలో భారీ వర్షం ( Rain) కురిసే అవకాశాలు ఉన్నట్లు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.దీంతో ఐపీఎల్ అభిమానులకు తొలి మ్యాచ్ లోనే నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తోంది. కోల్కత్తా వేదికగా జరిగే కేకేఆర్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( KKR vs Royal Challengers Bangalore ) మధ్య మ్యాచ్ 90% పైగా.. వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తాజాగా ప్రకటన చేయడం జరిగింది. ఈడెన్ గార్డెన్స్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: Team India Cash prize: టీమిండియాకు BCCI భారీ నజరానా..ICC కంటే ఎక్కువే.. ఎన్ని కోట్లంటే ?

పశ్చిమ బెంగాల్ లో వచ్చే కొన్ని రోజులపాటు ఉరుములు అలాగే మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదు అవుతుందని… వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. ఇక వాతావరణ శాఖ ప్రకటనతో… ఐపీఎల్ యాజమాన్యంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. ఏడాది తర్వాత టోర్నమెంట్ ప్రారంభం అవుతే.. ఇలా వర్షం పడడం ఏంటని… డీలా పడిపోతున్నారు అభిమానులు. అయితే వాతావరణ శాఖ పేర్కొన్నట్లు వర్షం పడితే… ఆరోజున మ్యాచ్ రద్దు అవుతుంది. మ్యాచ్ నిజంగానే రద్దు అయితే… చెరో పాయింట్ లభిస్తుంది. అయితే వర్షం పడుతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో… ఐపీఎల్ ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు. వర్షం పడకుండా.. దేవుడే కనుకరించాలని కోరుతున్నారు.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×