Big TV Kissik Talks: కొంతమందికి సక్సెస్ లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తుంది అని చెప్పడానికి సినీ పరిశ్రమలోనే చాలామంది ఉదాహరణగా ఉన్నారు. అలాంటి వారిలో మురళీధర్ గౌడ్ కూడా ఒకరు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ అనే సినిమాలో హీరో పాత్రలో నటించి ఒక్కసారిగా ఇండస్ట్రీలో లైమ్‌లైట్‌లోకి వచ్చారు మురళీధర్ గౌడ్. ఆ తర్వాత ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ కామెడీ చేసే పాత్ర ఏదైనా ఉంది అంటే దానికి మురళీధర్ గౌడ్ పేరునే ముందుగా పరిగణనలోకి తీసుకుంటున్నారు మేకర్స్. తాజాగా బిగ్ టీవీలోని కిసిక్ టాక్స్ పోడ్కాస్ట్‌లో పాల్గొన్న ఆయన.. పర్సనల్ లైఫ్‌పై పలు షాకింగ్ కామెంట్స్ చేశారు.
అందులో నటించినందుకు బాధపడ్డా
బిగ్ టీవీలో కిసిక్ టాక్స్ అనే పేరుతో ప్రారంభమయిన పోడ్కాస్ట్‌లో రెండో ఎపిసోడ్‌కు గెస్ట్‌గా ప్రస్తుతం టాలీవుడ్‌లో మెస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెలిగిపోతున్న మురళీధర్ గౌడ్ వచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. వర్ష ముద్దిస్తానని ఆశపడుతున్నానని స్టేట్‌మెంట్ ఇవ్వడంతో ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత తను కీలక పాత్రలో కనిపించనున్న ‘మ్యాడ్ 2’ నుండి ఒక జోక్ చెప్పారు. తాను ఈ వయసులో కూడా రొమాంటిక్ సీన్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో తను నటించడం బాధాకరంగా ఉందని, ఐశ్వర్య రాజేశ్ ఏమో తండ్రి అని, మీనాక్షి చౌదరి ఏమో బాబాయ్ అంటుందని ఫీల్ అయ్యానని తెలిపారు.
రెమ్యునరేషన్ ఎంతంటే.?
ఒక సినిమాకు తన రెమ్యునరేషన్ ఎంత అని అడగగా మురళీధర్ గౌడ్ (Muralidhar Goud) దానికి సమాధానం చెప్పనని చెప్పేశారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది కామన్ కాబట్టి దాని గురించి ఆయనను ప్రశ్నించగా.. ‘‘కమిట్మెంట్ అనేది నాకు సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే నేను నటిని కాదు నటుడిని. అందుకే నాకు అనుభవం కాలేదు. నన్ను ఎవరూ కమిట్మెంట్ అడగలేదు’’ అన్నారు. ఇక తను ఎలాంటి ఆర్థిక పరిస్థితిలో ఉన్న కుటుంబం నుండి వచ్చారో బయటపెట్టారు మురళీధర్ గౌడ్. ‘‘ఒక గుడ్డును ముగ్గురం తినేవాళ్లం. అప్పుడే కోట్ల రూపాయలు సంపాదించాలని కసితో ఫిక్స్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చారు మురళీధర్ గౌడ్.
Also Read: శోభిత టాలెంట్‌ను తొక్కేస్తున్నారు.. భార్యపై చైతూ ఊహించని కామెంట్స్.!
చావును కోరుకుంటా
ఈరోజుల్లో రిలేషన్‌షిప్స్‌పై కూడా మురళీధర్ గౌడ్ స్పందించారు. ‘‘అసలు ఆ రిలేషన్‌షిప్స్ రిజల్ట్స్ ఏంటి? మనిషి పుట్టుక ఏంటో తెలుసుకుంటే వాళ్లు ఎలా జీవించాలో తెలుసుకుంటారు’’ అంటూ ఈకాలం రిలేషన్‌షిప్స్‌పై కౌంటర్ వేశారు. ఇక దేవుడు తన ముందుకు వచ్చి చిటికెలో కోరిక తీరుస్తానంటూ తాను చావును కోరకుంటానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘‘ఇది ఇప్పటికిప్పుడు చెప్తున్న మాట కాదు.. నేను ఇప్పుడే చనిపోవడానికి సిద్ధం’’ అని అన్నారు. అసలు ఆయన ఎందుకు అలా అన్నారో తెలియాంటే ఈ శనివారం సాయంత్రం 7 గంటలకు బిగ్ టీవీ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలయ్యి కిసిక్ టాక్స్ లేటెస్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.