BigTV English

Pro Kabaddi League : మళ్లీ తొడకొట్టిన బాలయ్య..! ఈ సారి ఎక్కడంటే..?

Pro Kabaddi League : మళ్లీ తొడకొట్టిన బాలయ్య..! ఈ సారి ఎక్కడంటే..?
Pro Kabaddi League

Pro Kabaddi League : కంగారు పడకండి.. ఇది సినిమా వేదికలపైనో,  రాజకీయ వేదికలపైనో జరిగింది కాదు. ప్రో కబడ్డీ వేదికపై బాలయ్య తన స్టయిల్ లో తొడ కొట్టి తెలుగు టైటాన్స్ ని ఎంకరేజ్ చేశారు.


నిజానికి ఒకప్పుడు సంప్రదాయ ఆటలంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కబడ్డీ.. గ్రౌండ్ లోకి.. కబడ్డీ కబడ్డీ అంటూ కూత పెట్టుకుంటూ వెళ్లి అవతలి వాళ్లని టచ్ చేసి వస్తే చాలు.. ఒక పాయింట్ వచ్చేది.  దీనికి పైసా ఖర్చు కూడా అయ్యేది కాదు. నలుగురు కలిస్తే చాలు, ఒక చిన్న ఖాళీ స్థలంలో సరదాగా ఆడుకునేవారు. తర్వాత పండగలు, వేడుకల సమయంలో ఆడేవారు. తర్వాతర్వాత అన్ని సంప్రదాయ ఆటల్లాగే అది కనుమరుగైపోయింది.

ఈ సమయంలో మళ్లీ కబడ్డీ పోటీలకు ఒక కార్పొరేట్ లుక్ తీసుకొచ్చారు. ప్రో కబడ్డీ పేరుతో ఇప్పటికి పది సీజన్లు జరిగాయి. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియం వేదికగా తెలుగు టైటాన్స్ – బెంగళూరు బుల్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ కు ముఖ్య అతిథిగా హీరో బాలకృష్ణ వచ్చారు.


వచ్చీరాగానే తన స్టయిల్ లో సందడి చేశారు. తెలుగు టైటాన్స్ ని ఉత్సాహపరుస్తూ సినిమాల్లో తొడగొట్టినట్టు కొట్టారు. దీంతో ఒక్కసారి ఇండోర్ స్టేడియం అంతా కేకలు, అరుపులతో దద్ధరిల్లిపోయింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ క్రికెట్ తర్వాత కబడ్డీ ప్రాచుర్యం పొందిందని అన్నారు. తనకు ఆటలంటే చిన్నతనం నుంచి చాలా  ఇష్టం అని తన స్టయిల్ లో చెప్పారు.

తన కారులో ఎప్పుడూ క్రికెట్ కిట్ ఉంటుందని అన్నారు. షూటింగుల్లో ఖాళీ సమయం దొరికినా, సడన్ గా ప్యాకప్ చెప్పినా, లేదంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు సమయానికి విమానాలు, రైళ్లు అందుబాటులో లేకపోయినా, యూనిట్ అంతా ఖాళీ అయిపోతుంది.  ఆ సమయంలో షూటింగ్ స్పాట్ లోనే యూనిట్ సభ్యులతో సరదాగా క్రికెట్ ఆడతానని అన్నారు.

క్రికెట్ తో పాటు టేబుల్ టెన్నిస్ కూడా ఇష్టమని అన్నారు. కానీ ఇప్పుడు, ఈ లీగ్ కి ప్రచారకర్తగా ఉన్నాను కదా.. అందుకని కబడ్డీ కూడా ఇష్టమేనని అన్నారు. ప్రో కబడ్డీ చూస్తుంటే కళాశాల రోజులు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. ఆటలంటే తనకూ ఇష్టమేనని చెప్పారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×