E-Paper
Advertisement

Amazon : ఆన్‌లైన్‌లో అయోధ్య పేరుతో నకిలీ ప్రసాదం సేల్స్.. అమెజాన్‌కు కేంద్రం నోటీసులు..

Amazon : ఆన్‌లైన్‌లో అయోధ్య పేరుతో నకిలీ ప్రసాదం సేల్స్.. అమెజాన్‌కు కేంద్రం నోటీసులు..
Advertisement

Amazon : అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట ఘట్టానికి సమయం దగ్గర పడుతోంది. ఆ అపూర్వ ఘడియల కోసం యావత్ దేశం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో అయోధ్య పేరుతో ఆన్‌లైన్‌లో నకిలీ ఉత్పత్తుల వ్యాపారం జోరుగా సాగుతోంది.

తాజాగా ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఏకంగా అయోధ్య రాముడి పేరిట నకిలీ ప్రసాదం అమ్మకాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో అమెజాన్‌ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వారం రోజులలోపు వివరణ ఇవ్వాలని కోరింది.

Advertisement

అయోధ్య ప్రసాదం పేరుతో కస్టమర్లను మోసం చేస్తున్నారని దాఖలైన ఫిర్యాదుతో కేంద్ర ప్రభుత్వం ఈ నోటీసులు జారీ చేసింది. సాధారణ లడ్డూలను అయోధ్య అనే బ్రాండ్ వేసి అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. రఘుపతి నెయ్యి లడ్డూ, అయోధ్య రామ మందిర్‌ అయోధ్య ప్రసాద్‌, ఖోయా ఖోబీ లడ్డూ, రామ మందిర్‌ అయోధ్య ప్రసాదం-దేశీ దూద్‌ పేడా ఇతర ఉత్పత్తులను అమెజాన్‌లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సీసీపీఏకి ఫిర్యాదు చేయడంతో అమెజాన్‌ సంస్థకు నోటీసులు పంపించింది.

Related News

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Big Stories

Advertisement
×