Yash Thakur Autographs Trolls: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదో వన్డే సందర్భంగా బౌలర్ యష్ ఠాకూర్ (Yash Thakur)కు ఊహించని పరిణామం ఎదురైంది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగా, బౌండరీ గేట్ దగ్గర ఉన్న యష్ ఠాకూర్, కొంత మంది ఇండియన్ అభిమానులకు ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు. అనామక ప్లేయర్ అయినప్పటికీ, అతని ఆటోగ్రాఫ్ కోసం అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఈ తరుణంలోనే ఆ ఆటోగ్రాఫ్స్ ఆపేసి, తన కొడుకు కాసేపు ఎత్తుకో అంటూ యష్ ఠాకూర్‌నే ఓ అభిమాని అడిగేశాడు. దీంతో షాక్ తిన్న యష్, ఇదెక్కడి తలనొప్పిరా నాయనా అనుకుంటూ, అక్కడి నుంచి స్కిప్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. ఎవడ్రా మీరంతా ? మీ కొడుకులు, కూతుళ్లను ఎత్తుకోవడానికి యష్ ఎలా కనిపిస్తున్నాడు రా? అంటూ రియాక్ట్ అవుతున్నారు. సందు దొరికితే దూరిపోవడమే అంటూ మరి కొందరు సెటైర్లు పేల్చుతున్నారు.
టీమిండియా బౌలర్ యష్ ఠాకూర్ (Yash Thakur) న్యూజిలాండ్ తో జరిగిన 5వ మ్యాచ్ తోనే అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. దీంతో భారత జట్టు తరఫున వన్డే ఆడిన 267వ ప్లేయర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో 10 ఓవర్లు వేసి, 38 పరుగులు ఇచ్చాడు. ఓ వికెట్ కూడా పడగొట్టాడు. జింబాబ్వేతో 2026లో జరిగిన సిరీస్ లో టీ20 అరంగేట్రం చేశాడు. ఇతను కోల్ కతాకు చెందిన వాడు. దేశవాళీ క్రికెట్ లో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అటు ఐపీఎల్ లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. 2023 నుంచి 2024 వరకు లక్నో సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగాడు. 2025 నుంచి పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నారు. అతన్ని రూ.1.60 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. ఇప్పటికీ అదే జట్టుకు ఆడుతున్నాడు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం 5వ వన్డే జరిగింది. ఇందులో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ తరుణంలోనే 42.1 ఓవర్లు ఆడిన టీమిండియా, 209 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్ (46), ఇషాన్ కిషన్ (46) ఇద్దరే రాణించారు. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడ్డ న్యూజిలాండ్ 48.1 ఓవర్లు ఆడి, 187 పరుగులకు కుప్పకూలింది. దీంతో టీమిండియా 22 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. ఈ విజయంతో 5 వన్డేల సిరీస్ ను 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. నవంబర్ 19వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ షురూ కానుంది.
Indian fans are truly something else 😂
During the match, Yash Thakur was signing autographs for fans when one fan asked him to hold their baby in his arms. 😂 pic.twitter.com/LuBnnv7DXe
— HIMANI 🐥 (@himanii_68) November 15, 2026