Virat Kohli-Anushka Sharma Chants During USA India Match: ‘దీపావళి హో యా హోలీ.. అనుష్క లవ్స్ కోహ్లీ’.. ‘ 10 రుపీకీ పెప్సీ.. కోహ్లీ భాయ్ సెక్సీ’.. ఈ గజల్స్ ఎవరి కోసమో మీకు అర్థమయ్యే ఉంటుంది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అమెరికాతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు. అక్కడికి దగ్గరలో ఉన్న అభిమానులు కొందరు కోహ్లీని చూసిన ఆనందంతో రెచ్చిపోయారు. తమ ఆనందాన్ని గజల్స్ రూపంలో అలా వినిపించారు.
తెలుగులో వాటి అర్థం చెప్పాలంటే.. ‘దీపావళి, హోలీ వీటన్నిటి కన్నా, అనుష్కకి కోహ్లీ అంటేనే ఇష్టం’.. మరొకటి 10 రూపాయలు పెప్సీ.. కోహ్లీ భాయ్ సెక్సీ అంటూ చెప్పారు. ఇక్కడ మాత్రం పెప్సీ..సెక్సీ అని అర్థం వచ్చేలా వాడారంతే.. మన కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్ల దగ్గర పబ్లిక్ టాక్ అడుగుతుంటారు.
అక్కడ లక్ష్మణ్ అని సినిమా రివ్యూని కవితా రూపంలో చెబుతుంటాడు. అవి మంచి ట్రెండింగులో ఉంటాయి. బహుశా ఆ స్ట్రాటజీలో కామెడీగా, కొంచెం సెటైరిక్ గా చెప్పారేమో అనిపించింది. అయితే విరాట్ కోహ్లీ కూడా స్పందించకుండా ఉండలేకపోయాడు. తనకి ఒకవైపు నుంచి నవ్వు వస్తుంటే, ఆపుకుని ఎంజాయ్ చేశాడు. అనంతరం వారికి నవ్వుతూ చేయి చూపించి, అభినందిస్తూ, ఇంకా చాలు ఆట చూడండి అంటూ సైగలు చేశాడు.
Also Read: టీమ్ ఇండియాలో ఆ ప్రయోగం ఆగెదెన్నడు ?
వాళ్లు మాత్రం ఆగలేదు. కోహ్లీని చూసి నినాదాలు చేస్తూనే కనిపించారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు తను బౌండరీ దగ్గర ఉండటంతో కోహ్లీ-కోహ్లీ అంటూ అరుస్తూనే ఉన్నారు. నిజానికి కోహ్లీకి ఇంతమంది అభిమానం చూసి ఒకొక్కసారి భయం వేస్తుందంట. ఎందుకంటే తను మ్యాచ్ లో సరిగ్గా ఆడకపోతే, వారందరినీ హర్ట్ చేసినట్టు ఫీలవుతాడంట. అందుకే ప్రతీ మ్యాచ్ ని ఒక తపస్సులా భావించి ఆడతానని అంటుంటాడు.
Fans Chanting "10 rupay ki Pepsi, Kohli bhai sexyy" and "Diwali yha Holi, Anushka loves Kohli" 😄👌 pic.twitter.com/P0yECHeuRZ
— Johns. (@CricCrazyJohns) June 13, 2024
నిజానికి తన కోసం కాదు, దేశం కోసం, ఇంతమంది అభిమానుల కోసం, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఆడాలని నిత్యం తప్పిస్తుంటానని చెప్పాడు. అదే తన విజయ రహస్యమని అన్నాడు. కానీ ఈసారెందుకో 2024 టీ 20 ఆఖరి ప్రపంచకప్ విరాట్ కోహ్లీకి ఒక చేదు జ్నాపకంగా మారేలా ఉంది. అలా జరగకూడదని ఆశిద్దాం.