
Ind Vs Aus T20 : ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్ ల టీ 20 సిరీస్ కు టీమ్ ఇండియా జట్టుని బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ని ఎంపిక చేశారు. ప్రధాన కోచ్ గా లక్ష్మణ్ ఉంటారు. నవంబర్ 23న విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో సిరీస్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 3న బెంగళూరులో ముగిసే మ్యాచ్ తో సిరీస్ ముగుస్తుంది. అంతవరకు వీరిద్దరూ కోచ్ గా, కెప్టెన్ గా వ్యవహరిస్తారు.
వన్డే వరల్డ్ కప్ 2023 ఆడిన సూర్యకుమార్ తప్ప దాదాపు సీనియర్లు అందరికీ విశ్రాంతినిచ్చారు. ఆఖరికి శుభ్ మన్ గిల్ కి అవకాశం ఇవ్వలేదు. శ్రేయాస్ అయ్యర్ మాత్రం ఆఖరి రెండు టీ 20లకు హాజరవుతాడు.
వరల్డ్ కప్ అయిన వెంటనే అహ్మదాబాద్ లో సమావేశమైన సెలక్టర్లు మొదట శ్రేయాస్ అయ్యర్ ను కెప్టెన్ గా చేయాలని భావించారు. అయితే ఆసియా కప్ నుంచి తను ఎడతెరిపి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. అందుకే అతనికి పని భారం, ఒత్తిడి పెట్టకూడదని సూర్యని కెప్టెన్ గా చేశారు. రాయపూర్, బెంగళూరు లో జరిగే చివరి రెండు టీ 20ల కోసం శ్రేయాస్ జట్టులో చేరుతాడు. అయితే వైస్ కెప్టెన్ గా ఉంటాడు.
భారత కోచ్‌గా నియమితులైన రాహుల్ ద్రవిడ్ మూడు నెలల తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నందున కోచ్‌గా లక్ష్మణ్ నియామకం జరిగింది. అంతేకాకుండా, సాంకేతికంగా అతని పదవీకాలం ప్రపంచకప్ వరకు మాత్రమే. ప్రపంచకప్‌పై పూర్తిగా దృష్టి సారించినందున తన భవిష్యత్తు గురించి ఆలోచించే సమయం లేదంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
.
.