
Shami Wife : ఎప్పుడూ లేనిది, వరల్డ్ కప్ 2023 ప్రారంభమైన దగ్గర నుంచి మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియాలోకి వచ్చి ఏదొకటి మాట్లాడుతోంది. ముఖ్యంగా తన ఉద్దేశం ఏమిటి? అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఓటమి తర్వాత ఇన్ స్టాలో హసీన పెట్టిన రీల్ నెట్టింట కాక పుట్టిస్తుంది.
ఇంతకీ ఆ రీల్ సారాంశం ఏమిటంటే మంచి మనసున్నవాళ్లే ఫైనల్ లో గెలిచారని బ్యాగ్రౌండ్ లో ఒక పాట వినిపించేలా పోస్ట్ చేసింది. ఇప్పుడందరూ తనమీద విరుచుకుపడుతున్నారు. ఒకవైపు భారత్ ఓడిపోయి బాధలో ఉంటే పుండు మీద కారం జల్లేలా ఈ రీల్ ఏమిటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నువ్వు నీ భర్తను నిందిస్తున్నావా? లేక దేశాన్ని నిందిస్తున్నావా? అంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియా రీల్స్, కామెంట్స్ వెనుక నీ ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. షమీకి గొప్ప పేరు రావడం నీకు ఇష్టం లేక, ఇవన్నీ చేస్తున్నావు అంతే కదా…అని తిట్టిపోస్తున్నారు.
తనని మానసికంగా దెబ్బకొట్టడానికే మంచిగా మాట్లాడుతున్నట్టు నటించి ముంచేస్తున్నావని బాగా అంటించేస్తున్నారు. ఇవన్నీ భవిష్యత్తులో నీకే మంచివి కావు.. అందరికీ నీ మనస్తత్వం తెలిసి, నీకు మంచి చేయాలనుకునే వాళ్లు కూడా చేయరు, గుర్తు పెట్టుకో అని మందలిస్తున్నారు.
ఇప్పుడు షమీ నిన్ను బాధపెట్టాడా? నువ్వు షమీని బాధపెట్టావా? అన్నది నీ మాటల ద్వారానే ప్రపంచానికి నీకు తెలియకుండానే తెలియజేస్తున్నావు.. గమనించుకోమని హెచ్చరిస్తున్నారు.
మీలో మీకు ఎన్ని గొడవలున్నా, సరే, దేశం కోసం షమీ ఆడుతున్నప్పుడు సగటు భారతీయురాలిలా స్పందించాలి తప్ప, ఇలా సందు చూసి దెప్పి పొడవకూడదని అంటున్నారు.
మంచి భర్తలా ఉంటే బాగుండేది, మంచి తండ్రిలా ఉంటే బాగుండేది, లేకుంటే మేమంతా ఎంతో హ్యాపీగా ఉండేవాళ్లం, నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు, మంచి మనసున్నవాళ్లే గెలుస్తారు.. ఇలాంటి డైలాగులు వరల్డ్ కప్ ప్రారంభమయాక, షమీ పేరు వస్తున్నప్పుడు అనడం వెనుక కారణం ఏమిటి? అని గట్టిగానే అడుగుతున్నారు.
మొత్తానికి షమీకి ప్రపంచ కప్ తర్వాత ఎంత పేరు వచ్చిందో, తన భార్య వల్ల వచ్చిన చికాకుల నుంచి కూడా విముక్తి దొరికిందని చాలామంది అంటున్నారు. ఇన్నాళ్లూ షమీ మీద ఏమూలనో చిన్న అనుమానం ఉండేది. ఇప్పుడది పోయిందని తేల్చి చెబుతున్నారు.