BigTV English

Prize Money For Team India: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Prize Money For Team India: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Jay Shah Announces Prize Money For Team India: ఐసీసీ 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు భారీ నజరానా ప్రకటించింది. ప్రపంచ కప్‌లో అద్భుతమైన ఆటతీరు కనబరిచిన టీమిండియా ఆటగాళ్లకు రూ. 125 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. అత్యుత్తమ విజయం సాధించిన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది అందరికీ అభినందనలు అంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.


దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో గెలిచి, రెండోసారి పొట్టి కప్పును సాధించింది. ఈ సందర్భంగా జైషా తన సందేశంలో ఏమన్నారంటే.. టోర్నమెంటు ఆసాంతం టీమ్ ఇండియా అసాధారణమైన ప్రతిభ చూపింది. గెలవాలనే తపన, సంకల్పం నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాదు అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ఘన విజయం సాధించిన ఆటగాళ్లు, కోచ్ లు, సహాయక సిబ్బంది అందరికీ అభినందనలు అని పేర్కొన్నారు.

నేటి యువతకు ఈ గెలుపు ఒక ఆదర్శంగా, స్ఫూర్తిగా ఉండాలని నేటిజన్లు సూచిస్తున్నారు. అయితే చాలామంది అనేమాట ఏమిటంటే, ఆటగాళ్లు ఎవరికెంత? ఎలా? ఇస్తారని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ గ్రేడ్ లు విధించిన దానిని బట్టే, ప్రైజ్ మనీని కూడా విభజిస్తారని అంటున్నారు. కెప్టెన్ కి మాత్రం కొంచెం ఎక్కువ ఉండవచ్చునని అంటున్నారు.


Also Read: ఫైనల్ మ్యాచ్ లైవ్ ఎంతమంది చూశారో తెలుసా?

టీమ్ ఇండియాలో 15 మంది జట్టు సభ్యులు ఉంటే, రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో రింకూ సింగ్, శుభ్ మన్ గిల్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ ఉన్నారు. వీరికి కూడా ఎంతో కొంత అందజేస్తారని అంటున్నారు. అలాగే హెడ్ కోచ్ ద్రావిడ్, ఇంకా కోచింగ్ స్టాఫ్, సహాయక సిబ్బంది ఇలా అందరికీ ప్రైజ్ మనీని, వారి స్థాయిని బట్టి అందుతుందని చెబుతున్నారు.

అలాగే వరల్డ్ కప్ గెలిచినందుకు అక్కడ వచ్చే ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. అది కూడా ఆటగాళ్లకు అందుతుందని అంటున్నారు. మొత్తానికి ప్రపంచకప్ గెలిచారు. బంపర్ మనీ ప్రైజ్ లు కూడా గెలుచుకున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇక పండగ చేస్కోండి అంటున్నారు.

Related News

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Big Stories

×