Sumanth: యార్లగడ్డ సుమంత్ కుమార్ ఈ పేరు అంటే తెలియకపోవచ్చు కానీ, హీరో సుమంత్ అంటే మాత్రం అందరికీ తెలుస్తుంది. అక్కినేని నట వారసుడిగా ప్రేమకథ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు సుమంత్. అనేక చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. ప్రస్తుతం కొంతకాలం మూవీస్ కి బ్రేక్ ఇచ్చి మళ్లీ మరో కొత్త మూవీతో కం బ్యాక్ ఇవ్వనున్నారు. సుమంత్ లేటెస్ట్ గా నటించిన సినిమా అనగనగా ఈటీవీ విన్ లో మే 15న స్ట్రీమింగ్ కానుంది. అందులో భాగంగా సుమంత్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సినిమాలో తను కోరుకున్న క్యారెక్టర్ ఇప్పటి వరకు చేయలేదని.. అలాంటి క్యారెక్టర్ అయితే ట్రై చేస్తా అంటూ ఫ్యాన్స్ తో తన మూవీ విశేషాలను పంచుకున్నారు.
అలాంటి క్యారెక్టర్ అయితే ట్రై చేస్తా..
సుమంత్ 1999లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తరువాత వచ్చిన యువకుడు మూవీ తో మంచి ప్రశంసలు అందుకున్నాడు. 2003లో వచ్చిన సత్యం మూవీతో క్రేజ్ సంపాదించాడు. ఇక గోదావరి తో స్టార్ హీరో అయ్యారు. ఇక అక్కడి నుంచి మంచి నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ, అడపాదడపా మూవీస్ చేస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఇండస్ట్రీలో నెలకొల్పారు. తాజాగా ఇప్పుడు అనగనగా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుమంత్, కాజల్ చౌదరి జంటగా సన్నీ సంజయ్ దర్శకత్వంలో అనగనగా మూవీ రూపొందింది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా సుమంత్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను నా సినిమాలలో ఏ రోల్ చేయాలనుకుంటున్నాను అనేది ముందుగానే చూస్ చేసుకునే వాడిని, కానీ వచ్చిన కథలో నుంచి ఒకటి తీసుకోవాలి కానీ, నాకంటూ ఓ కోరిక ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ చేయాలని నా మనసులో ఉంటుంది. నేను ఒక మంచి విలన్ గా చేయాలన్నది నా కోరిక. ఇది ఇప్పుడు కాదు.. ఎప్పటినుంచో చెప్తున్నాను కానీ అలాంటి కథ ఇప్పటివరకు రాలేదు. అది రానప్పుడు వచ్చి దానిలో మనం ఏదో ఒకటి చూస్ చేసుకుని వెళ్లాలి. ఒక సాఫ్ట్ క్యారెక్టర్, లేదంటే రఫ్ క్యారెక్టర్ అంతే మనం అనుకున్నది జరగదు. ఉన్నవాటిలో ఏ కధ ఆకట్టుకుంటే అదే చేస్తూ వెళ్తున్నాను. ఇకమీదటైనా విలన్ క్యారెక్టర్ వస్తే చేయాలని ఉంది అని తెలిపారు.
ఇక హీరోగా కన్నా ఆ క్యారెక్టర్ ఐతే చాలు ..
వెల్ రిటర్న్ విలన్ అనేది మీరు ఎవరైనా డైరెక్టర్ తో చెప్పారా అనే ప్రశ్న అడగ్గా.. నేను ఎంతోమందికి చెప్పాను. అది నా కోరిక. ఏదో ఒక విలన్ అంటే విలన్ గా కాకుండా ఒక పెద్ద మీసం, ఊరికే అరవడం అలాంటి క్యారెక్టర్ కాకుండా, ఒక మంచి గ్రాఫ్ ఉన్న క్యారెక్టర్ కావాలి. విలన్ గా నన్ను నేను ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ కావాలి. నేను చేయగలను. నాకు తెలుసు కానీ, అవకాశాలు రావట్లేదు. ఏమో ఫ్యూచర్లో అలాంటి కథలు వస్తాయేమో చూడాలి అని సుమంత్ తెలిపారు. ఆయన అనగనగా మూవీ లో టీచర్ పాత్రలో నటిస్తున్నారు.
Adivi Sesh : బ్రదర్ ఫ్రొం అనొథెర్ మదర్.. వామ్మో.. ఏంటి ఇంత పెద్ద డైలాగ్ కొట్టాడు.