MI’s 4th IPL Title: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) కొనసాగుతున్న నేపథ్యంలో… ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో జరిగిన విరోచిత పోరాటాలకు సంబంధించిన వీడియోలు అలాగే పోస్టులు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆటగాళ్లు… అద్భుతంగా ఆడిన మ్యాచ్ ల వివరాలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు షేన్ వాట్సన్ ( Shane Watson) ఆడిన ఓ బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రక్తం కారుతున్నా… తన పోరాటాన్ని మాత్రం వదలలేదు.
కాలుకు ఏడు కుట్లు.. రక్తం కారుతున్నా వాట్సన్ పోరాటం
ఐపీఎల్ 2019 సీజన్ ( Indian Premier League 2019 Tournament ) సమయంలో ముంబై ఇండియన్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అద్భుతంగా రానించి ఫైనల్ కు చేరుకున్నాయి. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా రాణించి ఛాంపియన్గా నిలిచింది. అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా తక్కువేమీ తినలేదు. ఫైనల్ మ్యాచ్ లో చివరి బంతి వరకు గట్టి పోటీ ఇచ్చి చివరికి ఓడిపోయింది. ఈ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జాతీయ జట్టుకు కూడా ఇంత ఎఫెక్ట్ పెట్టి ఆడలేదు కావచ్చు… అంత అద్భుతంగా ఆడాడు వాట్సన్.
2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు వాట్సన్. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడిన వాట్సన్… ఆ సీజన్ లో దుమ్ము లేపాడు. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ సందర్భంగా 59 బంధువుల్లో 80 పరుగులు చేసి దుమ్ము లేపాడు వాట్సన్. అయితే ఈ మ్యాచ్ కంటే ముందే వాట్సన్ కాలుకు ఏడు కుట్లు పడ్డాయని సమాచారం. అయినప్పటికీ ఫైనల్ మ్యాచ్ కావడంతో ఆ గాయంతోనే బ్యాటింగ్ చేశాడు. గట్టిగానే పరుగులు కూడా తీశాడు. సిక్సర్లతో పాటు బౌండరీలు కొట్టాడు. ఈ నేపథ్యంలోనే తన కాలుకు బ్లీడింగ్ కూడా అయింది. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు వాట్సన్.
చివరి వరకు ఆడి మ్యాచ్ను గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఒక్క బంతికి రెండు పరుగులు చేయాల్సిన సమయంలో.. ముంబై ఇండియన్స్ డేంజర్ బౌలర్ మలింగా వికెట్ పడగొట్టాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది. అటు ఈ మ్యాచ్లో.. గెలిచి చాంపియన్గా నిలిచింది ముంబై ఇండియన్స్. ఇప్పుడు ఈ మ్యాచ్ కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: Ben Cutting – SRH: ఆ ఒక్కడి పేరు చెబితే.. RCB ఇప్పటికీ వణికిపోతుంది.. పీడ కల మిగిల్చాడు