BigTV English

IPL T10 league 2024 : ఐపీఎల్ టీ 10 మ్యాచ్ లు కూడా వస్తున్నాయా?

IPL T10 league 2024 : ఐపీఎల్ టీ 10 మ్యాచ్ లు కూడా వస్తున్నాయా?
IPL T10 league

IPL T10 league 2024 : ఐపీఎల్ టీ 20 లీగ్ ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ ల వల్ల బీసీసీఐ ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రపంచ క్రికెట్ లో అత్యధికా ఆదాయం ఉన్న బోర్డుగా బీసీసీఐకి మంచి పేరుంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త క్రికెట్ లీగ్ మ్యాచ్ లకి రూపకల్పన చేస్తోంది.


ఇప్పటికే టీ 20 మ్యాచ్ లకు విపరతీమైన ఆదరణ ఉండటంతో ఆ పరిస్థితిని ఎందుకు పాడు చేసుకోవడమని అనుకుంటున్నారు. ఇప్పుడు జనం అందరూ టీ 10 మ్యాచ్ లకి అలవాటు పడితే, రాన్రాను టీ 20ల మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు వన్డే మ్యాచ్ లకు అదే గతి పట్టింది. ఈ సంగతి  వరల్డ్ కప్ 2023లో నిరూపణ అయ్యింది.

ఎందుకంటే టీమ్ ఇండియా ఆడిన మ్యాచ్ ల్లో తప్ప, మిగిలిన జట్లు ఆడిన మ్యాచ్ లకి గ్రౌండ్లలో జనమే లేదు,. దీనికి బలమైన కారణం ఏమిటంటే టీ 20 మ్యాచ్ లు. మనుషులు స్పీడు యుగంలో పడ్డారు. వారికి ఎంటర్ టైన్మెంట్ కావాలి. మ్యాచ్ లు కావాలి. కానీ త్వరగా అయిపోవాలి. అదీ సంగతి…ఈ నేపథ్యంలో టీ 10 లీగ్ లను గానీ బీసీసీఐ ప్రారంభిస్తే, తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు అవతుందని అంటున్నారు.


ఐపీఎల్‌ మ్యాచ్ లకు వచ్చే ఆదరణ తగ్గకుండా ప్లాన్ చేయాలని చూస్తున్నారు. ప్రధాన జట్లు, వారి షెడ్యూల్స్ ఇబ్బంది లేకుండా యువ రక్తంతో కొత్త లీగ్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో కొత్త లీగ్ విషయమై బీసీసీఐ నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈలోపు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.

తీరా ముందుకెళ్లాక, మళ్లీ వెనుకడుగు వేస్తే బాగుండదని ఒకటికి పదిసార్లు ఆలోచన చేస్తున్నారు. ఈ  పది ఓవర్ల ప్రతిపాదిత లీగ్‌కు సంబంధించిన బ్లూప్రింట్ విషయమై బీసీసీఐ కార్యదర్శి జై షా పని చేస్తున్నారు. ఈ సరికొత్త  ఆలోచనను స్పాన్సర్లు, స్టేక్ హోల్డర్లను స్వాగతించినట్లు తెలిసింది.

కొత్త లీగ్ ఫ్రాంచైజీల కోసం ప్రత్యేకంగా టెండర్లు నిర్వహించాలా? అని ఆలోచిస్తున్నారు. లేదంటే ప్రస్తుతం ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీలకే ఇస్తారా? అని చూస్తున్నారు. ఇక ఇంతదూరం వచ్చిందంటే కచ్చితంగా ఐపీఎల్ టీ 10 మ్యాచ్ లను కూడా త్వరలో చూసే అవకాశం ఉందని అంటున్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×