BigTV English

BCCI Record : ఆదాయంలో సరికొత్త రికార్డు సృష్టించిన BCCI…ఎన్ని కోట్లంటే

BCCI Record : ఆదాయంలో సరికొత్త రికార్డు సృష్టించిన BCCI…ఎన్ని కోట్లంటే
Advertisement

BCCI Record :  భారత క్రికెట్ నియంత్రణ మండలి 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీ ఆదాయాన్ని అర్జించింది. తాజాగా మరో సారి తన ఆర్థిక బలాన్ని చాటుకుంది. మొత్తం రూ.9,741.7 కోట్ల ఆదాయంతో ప్రపంచ క్రికెట్ లో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ ఆదాయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సగ భాగాని కంటే ఎక్కువగానే కీలక పాత్ర పోషిస్తుంది. అంటే.. 5,761 కోట్లను అందించింది ఐపీఎల్. మొత్తం ఆదాయంలో దాదాపు 59 శాతం కావడం విశేషం.


బీసీసీఐ కి బంగారు బాతులా ఐపీఎల్

2007లో ప్రారంభమైన ఐపీఎల్ కేవలం ఒక క్రికెట్ లీగ్ గా కాకుండా బీసీసీఐకి ఒక బంగారు బాతుగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతీ ఏడాది పెరుగుతున్న మీడియా హక్కులు స్పాన్సర్ షిప్ డీల్స్ తో ఐపీఎల్ భారత క్రికెట్ కి ప్రధాన ఆర్థిక వనరుగా నిలిచింది. ఈ లీగ్ దేశీయ ఆటగాళ్లకు, యువ ప్రతిభ వంతులకు అద్భుతమైన వేదికను అందిస్తూ.. అదే సమయంలో బోర్డుకు భారీగా లాభాలను అర్జించి పెడుతోంది. ఐపీఎల్ ప్రధాన ఆదాయ వనరు అయినప్పటికీ బీసీసీఐ కి ఇతర మార్గాల నుంచి కూడా గణనీయమైన ఆదాయం లభిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి రూ.1,042 కోట్లు మొత్తం ఆదాయంలో 10.7 శాతం కోట్లు, ఫిక్స్ డ్ డిపాజిట్లు పెట్టుబడుల నుంచి వడ్డీ రూపంలో రూ.987 కోట్లు 10.1 శాతం వచ్చాయి. ఐపీఎల్ కాకుండా మీడియా హక్కుల ద్వారా రూ.361 కోట్లు.. మహిళల ప్రీమియర్ లీగ్ ద్వారా రూ.378 కోట్లు కూడా బీసీసీఐ ఖాతాలోకి చేరాయి. భారత్ లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలు, కమర్షియల్ హక్కుల ద్వారా రూ.361 కోట్లు వచ్చాయి.


భవిష్యత్ లో మరింత వృద్ధి 

ప్రస్తుతం బీసీసీఐ వద్ద సుమారు రూ.30వేల కోట్ల వరకు నిల్వలు ఉన్నాయని.. వీటి నుంచి వడ్డీ రూపంలో ప్రతీ సంవత్సరం సుమారు రూ.1,000 కోట్లు వస్తున్నాయని రెడిఫ్యూషన్ నివేదిక వెల్లడించింది. స్పాన్సర్ షిప్.. మీడియా ఒప్పందాలు మ్యాచ్ డే ఆదాయాల విస్తరణతో ఈ ఆదాయాలు ఏటీ 10 నుంచి 12 శాతం మేర వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచెనా వేస్తున్నారు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, సీకే నాయుడు, దేశీయ టోర్నమెంట్ లను మరింత వాణిజ్యీకరించడం ద్వారా ఐపీఎల్ ఆదాయాలను పెంచుకోవడానికి బీసీసీఐకి అపారమైన సామర్థ్యం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా బీసీసీఐ సాధిస్తున్న ఈ అద్భుతమైన ఆర్థిక వృద్ధి  భారత క్రికెట్ బలానికి.. దేశంలో క్రికెట్ కు ఉన్న విశేష ప్రజాదారణకు నిదర్శనం. ఈ ఆదాయం భారత క్రికెట్ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు దేశీయ ఆటగాళ్లకు ప్రోత్సాహాన్ని అందించేందుకు దోహదపడుతుంది. మరోవైపు టీమిండియా మ్యాచ్ ల హక్కులు వయాకామ్ -18 దగ్గర ఉన్నాయి. 2023-27 ఐపీఎల్ మీడియా హక్కులను డిస్నీ స్టార్, వయాకామ్ 18 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

Related News

Mohammad Rizwan: రిజ్వాన్ కెప్టెన్సీ తొల‌గించ‌డం వెనుక పాల‌స్తీనా కుట్ర‌లు..!

Mohsin Naqvi: సూర్యకు కుద‌ర‌క‌పోతే, నా ఆఫీసుకు అర్ష‌దీప్ ను పంపించండి..ఆసియా క‌ప్ ఇచ్చేస్తా

Team India -Divorce: విడాకులు తీసుకున్న మ‌రో టీమిండియా ప్లేయ‌ర్‌…భార్య లేకుండానే దీపావ‌ళి వేడుకలు

Rishabh Pant : బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం..కెప్టెన్ గా రిషబ్ పంత్…సర్ఫరాజ్ ఖాన్ కు నిరాశే

Team India: 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు…20 బంతుల్లోనే సెంచ‌రీ, టీమిండియా ప్లేయ‌ర్ అరాచ‌కం..బౌల‌ర్ల‌కు న‌ర‌కం చూపించాడు!

SLW vs BANW: 4 బంతుల‌కు 4 వికెట్లు.. శ్రీలంక చేతిలో ఘోర ఓట‌మి, వ‌ర‌ల్ట్ క‌ప్ నుంచి బంగ్లాదేశ్‌ ఎలిమినేట్‌

Parvez Rasool: టీమిండియా ఆల్ రౌండ‌ర్ రిటైర్మెంట్‌..రెండు మ్యాచ్ ల‌కే కెరీర్ క్లోజ్‌

Pakistan: పాకిస్తాన్ కు కొత్త కెప్టెన్‌..25 ఏళ్ల కుర్రాడికి ప‌గ్గాలు, రెండు ఏళ్ల‌లో 10 మందిని మార్చిన PCB

Big Stories

×