BigTV English

Mohammad Shami: మహ్మద్ షమీ రావడం లేదు.. చెప్పకనే చెప్పిన జైషా

Mohammad Shami: మహ్మద్ షమీ రావడం లేదు.. చెప్పకనే చెప్పిన జైషా

BCCI Secretary Jay Shah


Jay Shah Confirms Mohammed Shami Set to Miss T20 World Cup: టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదు. జూన్ లో జరగనున్న టీ 20 ప్రపంచకప్ లో ఆడే అవకాశాలు దాదాపు లేనట్టేనని బీసీసీఐ సెక్రటరీ జైషా పరోక్షంగా చెప్పాడు. అంటే అది కూడా ఎలా చెప్పారంటే ఈ ఏడాది సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ జరగనుంది. స్వదేశంలో జరగనున్న ఆ మ్యాచ్ ల ద్వారా మహ్మద్ షమీ మళ్లీ పునరాగమనం చేయగలడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.


అంతేకాదు మహ్మద్ షమీ శస్త్ర చికిత్స విజయవంతమైందని, భారత్ వచ్చేశాడని తెలిపాడు. ఈ మాటల అర్థం ఏమిటంటే మరో కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్, తర్వాత ప్రారంభం కానున్న వన్డే టీ 20 ప్రపంచకప్ లో షమీ ఆడటం లేదని అర్థమైపోతోంది.

Also Read: మేం వచ్చాం.. మరి మీరొస్తారా? భారత్ రాక కోసం ఎదురుచూస్తున్న పాక్

షమీతో పాటు కేఎల్ రాహుల్ పునరాగమనంపై అప్‌డేట్ ఇస్తూ, కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్నారని, పునరావాసం ప్రారంభించారని జైషా చెప్పారు. అంటే రాబోయే ఐపీఎల్‌లో రాహుల్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పటి నుంచి టీ 20 ప్రపంచ కప్ నకు సన్నద్ధం కావాలంటే ఎవరు ఆడాలి? ఎవరు ఉండాలి? ప్రత్యామ్నాయ వనరులు ఇవన్నీ వెతుక్కునే పనిలో అప్పుడే బీసీసీఐ పడింది. ఒకవేళ మహ్మద్ షమీని ఎంపిక చేయకపోతే సోషల్ మీడియా దాడి నుంచి తట్టుకోలేమని భావించి ముందుగానే జైషా ఇలా చెప్పి ఉండవచ్చునని అంటున్నారు.

కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ముందుగానే జట్టుని చెప్పకనే చెప్పాడు. ఎవరూ జుత్తు పీక్కోవల్సిన అవసరం లేదు. అందరూ దాదాపు ఖరారైపోయినట్టే, వాళ్లందరూ మీకు తెలిసినవాళ్లేనని అన్నాడు. అంటే తన మాటలను బట్టి టీ 20 ప్రపంచకప్ లో వీరుంటారని అంటున్నారు.

రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, గిల్/సూర్యకుమార్ యాదవ్, కొహ్లీ, రాహుల్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, రవీంద్ర జడేజా, బుమ్రా, కులదీప్/ అక్షర్ పటేల్, సిరాజ్/ అర్షదీప్ సింగ్ ఇలా ఉండవచ్చునని అంచనాలు వేస్తున్నారు.

Tags

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×