VVS on Vaibhav Suryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో సోమవారం రోజున రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Rajasthan Royals vs Gujarat Titans ) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా 14 ఏళ్ల రాజస్థాన్ కుర్రాడు తెరపైకి వచ్చాడు. 14 సంవత్సరాల రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ అద్భుతంగా సెంచరీ సాధించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి తొలి భారతీయుడిగా.. సరికొత్త చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi ). దీంతో ఇప్పుడు సూర్య వంశీ గురించి అందరూ చర్చించుకుంటున్నారు.
Also Read: Shubman Gill Sister: గిల్ సెంచరీ చేయాలని.. ఈ అందమైన అమ్మాయి ఏం చేసిందంటే
సూర్య వంశీ టాలెంట్ గుర్తించిన లక్ష్మణ్
వైభవ్ సూర్య వంశీ బీహార్ కు చెందిన ఈ కుర్రాడు అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యాడు. ఈ కుర్రాడిని.. వివిఎస్ లక్ష్మణ్ ( VVS Laxman) గుర్తించాడు. అండర్ 19 వన్డే చాలెంజర్ టోర్నమెంటులో టీమిండియా B ( Team India B)జట్టు తరఫున సూర్య వంశీ ఆడాడు. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశం 36 పరుగులకే అవుట్ అయ్యాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లోకి కన్నీళ్లు పెట్టుకున్నాడు 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ. ఇక అదే సమయంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్… వైభవ్ సూర్య వంశీ దగ్గరికి వెళ్ళాడు.
అలా ఏడవకూడదు… నీ నుంచి టీమిండియా చాలా కోరుకుంటుంది. దాని పైన దృష్టి పెట్టు.. క్రికెట్ ఎలా ఉండాలి అలాగే… జట్టుకుని అవసరం ఏంటో గుర్తించుకొని రాణించు.. అంటూ వైభవ్ సూర్య వంశీని ఓదార్చాడు వివిఎస్ లక్ష్మణ్. అలా అతనిలో నైపుణ్యాన్ని కూడా పెంపొందించాడు. అప్పటినుంచి రెచ్చిపోయిన 14 ఏళ్ల సూర్య వంశీ… ఐపీఎల్ వేలం వరకు వచ్చాడు.
Also Read: Vaibhav Suryavanshi: బుడ్డోడు అనుకున్నార్రా.. 14 ఏళ్ళ వైభవ్ సూర్యవంశీ సెంచరీ
ద్రవిడ్ కు… వైభవ్ పై సిఫారసు చేసిన వివిఎస్ లక్ష్మణ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం.. గత డిసెంబర్ సమయంలో మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు ఈ 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ గురించి రాజస్థాన్ రాయల్స్ కోచ్ గా ( Rajasthan Royals ) ఉన్న రాహుల్ ద్రావిడ్ కు ( Rahul Dravid ) సిఫారసు చేశాడు వివిఎస్ లక్ష్మణ్. దీంతో రాహుల్ ద్రావిడ్ సూచన మేరకు మెగా వేలంలో… 1.10 కోట్లకు వైభవ్ సూర్య వంశీని వెంటనే… రాజస్థాన్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అలా రాజస్థాన్ జట్టులోకి వచ్చి సరికొత్త చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో…. కేవలం 35 బంతుల్లోనే.. సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో… సరికొత్త రికార్డు సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. దీంతో మాజీ క్రికెటర్లు అలాగే క్రికెట్ అభిమానులు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.