BigTV English

Vaibhav Suryavanshi: వైభవ్ సెంచరీ.. పేరెంట్స్ ఎమోషనల్

Vaibhav Suryavanshi: వైభవ్ సెంచరీ.. పేరెంట్స్ ఎమోషనల్

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. క్రికెట్ లవర్స్ మరో టెండూల్కర్ అంటూ కొనియాడుతున్నారు. రాత్రికి రాత్రే టాప్ సెలబ్రిటీ అయిపోయాడు. క్రికెట్ దిగ్గజాలు సైతం నూనూగు మీసాల రాని కుర్రోడ్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. అసలు వైభవ్ ఎంపికపై డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. వైభవ్ వెనుక కర్మ, కర్త, క్రియ అన్నీ టీమిండియా మాజీ కోచ్ రాహల్ ద్రావిడ్.


ఆదివారం రాత్రి జరిగిన రాజస్థాన్-గుజరాత్ ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ లవర్స్‌కు తీపి గుర్తుగా మిలిగిపోయింది. ఓ వైపు అంతర్జాతీయ ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, కరీంజనత్ వంటి బౌలర్లు. ఇంకోవైపు నూనూగు మీసాలు రాని యువకుడి వైభవ్. కేవలం సహచరుడి నుంచి మాత్రమే సహకారం.

ప్రత్యర్థులు నిప్పులు చెరిగే బంతులు వేస్తున్నారు. ఏ మాత్రం ఏకాగ్రత చెదిరిపోకుండా బౌలర్‌పై విరుచుకుపడ్డాడు వైభవ్ సూర్యవంశీ. బౌలర్ ఎవరైతేనేం అయితే సిక్స్.. లేదంటే బౌండరీ తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. అనుకున్నది సుసాధ్యం చేశాడు.. క్రికెట్ ప్రముఖులతో ప్రశంసలు అందుకుంటున్నాడు. కేవలం 35 బంతుల్లో సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో తక్కువ బంతుల్లో సెంచరీ చేసినవాళ్లలో తొలి కిస్ గేల్ కాగా, ఆ  తర్వాత వైభవ్ మాత్రమే ఉన్నాడు.


జట్టును విజయపథంలో నడిపిన కొడుకుపై తల్లిదండ్రులు కాసింత ఎమోషనల్ అయ్యారు. కొడుకు గురించి అందరు మాట్లాడడంతో ఉప్పొంగిపోయారు. వైభవ్ కేవలం 35 బంతుల్లో సెంచరీ సాధించి తన జట్టు విజయ పథంలో నడిపించాడని, అతని విజయం పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు.

ALSO READ: వైభవ్ కన్నీళ్లు చూసి

రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం, తోటి ఆటగాళ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. వైభవ్ సాధించిన ఘనత ఈ ప్రాంతానికి పరిమితం కాలేదని జిల్లా, రాష్ట్రం, దేశం వైభవ్ అద్భుతమైన బ్యాటింగ్ గురించి చెప్పుకుంటుందోనని అన్నారు.

మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడిన వైభవ్.. ఏళ్ల తరబడి తాను చేసిన పోరాటానికి ఫలితం దక్కిందన్నాడు. తన తల్లి రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోయేదని, తన కలను నెరవేర్చుకోవడానికి తండ్రి తన ఉద్యోగాన్ని ఎలా వదులుకున్నాడని చెప్పాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తాను క్రికెటర్ కావాలనే కలను సజీవంగా ఉంచిందన్నాడు. ప్రాక్టీస్ వల్ల, మా అమ్మ అర్థరాత్రి రెండు గంటలకు నిద్ర లేచేది. రాత్రి 11 గంటలకు నిద్రపోయేది.

గడిచిన మూడు, నాలుగు నెలలు రాజస్థాన్ జట్టుతో ఉండడం వల్ల మంచి ప్రాక్టీస్ వచ్చిందన్నాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, సాయిరాజ్ బహుతులేతోపాటు చేసిన కృషి మరువలేమన్నాడు. తనను వారితో ఉండడం వల్ల ఆటతీరును మెరుగు పరుచుకున్నట్లు చెప్పాడు. సీనియర్ల నుండి చక్కటి మద్దతు లభించిందన్నాడు. సంజు, ర్యాన్ , యశస్వి, నితీష్ భయ్యాలు సహాయం మరువలేనిదన్నాడు.

 

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×