Shubman Gill Sister: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… ఇప్పటికే 45 కు పైగా మ్యాచులు జరిగాయి. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Rajasthan Royals vs Gujarat Titans ) మధ్య మ్యాచ్ కూడా జరిగింది. ఈ మ్యాచ్ జైపూర్ ( JAIPUR) వేదికగా జరిగింది. సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్… అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్.. 209 పరుగులు చేసింది.
Also Read: SRH- Don Film : అక్కినేని నాగార్జునను ట్రోల్ చేసిన SRH ప్లేయర్లు.. డాన్ మూవీ డైలాగ్ చెబుతూ
దుమ్ము లేపిన శుభ్‌మన్ గిల్
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) మరోసారి మెరిశాడు. ఈ టోర్నమెంట్లో… అదరగొడుతున్న శుభ్‌మన్ గిల్… ఇవాల్టి మ్యాచ్లో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 50 బంతులు ఆడిన శుభ్‌మన్ గిల్… 84 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు ఐదు బౌండరీలు ఉన్నాయి. 168 ట్రైలర్తో గిల్ అదరగొట్టాడు. అటు శుభ్‌మన్ గిల్ తో పాటు సాయి సుదర్శన్ అలాగే జోష్ బట్లర్ కూడా అదరగొట్టారు. ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ 30 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఒక సిక్సర్ తో పాటు నాలుగు బౌండరీలు సాధించాడు. అటు వికెట్ కీపర్ జోష్ బట్లర్… 26 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు మూడు బౌండరీలు ఉన్నాయి.
స్టేడియంలో మెరిసిన శుభ్‌మన్ గిల్ సోదరి
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సెంటర్ ఆఫ్ యాక్షన్ గా శుభ్‌మన్ గిల్ సోదరి షహనీల్ గిల్ ( Shahneel Gill ) నిలిచింది. ఈ మ్యాచ్ లో ఆధ్యాంతం కెమెరామెన్ ఆమెనే చూపించాడు. ఇక తన సోదరి రావడంతో శుభ్‌మన్ గిల్ కూడా అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో 84 పరుగులు సాధించాడు సుబ్రమణ్యం. అయితే ఈ మ్యాచ్ మధ్యలో శుభ్‌మన్ గిల్ క్యాచ్ రాజస్థాన్ ప్లేయర్ వదిలేసాడు. ఆ సమయంలో శుభ్‌మన్ గిల్ సోదరి షహనీల్ గిల్ ( Shahneel Gill )… షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ ఫోటోను చూసిన నెటిజెన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… చేజింగ్ లో… రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది. కచ్చితంగా ఇవాల్టి మ్యాచ్ లో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు ఇద్దరు అదరగొడుతున్నారు. ఇద్దరు కలిసి సెంచరీ పార్ట్నర్షిప్ దిశగా దూసుకు వెళ్తున్నారు. వీళ్ళ ఊపు చూస్తుంటే మ్యాచ్ గెలిచేలా కనిపిస్తున్నారు.
Also Read: Kohli – KL Rahul: వివాదంలో విరాట్ కోహ్లీ… కన్నడీల తిరుగుబాటు.. RCB నుంచి ఔట్!