BigTV English

Vaibhav Suryavanshi: బుడ్డోడు అనుకున్నార్రా.. 14 ఏళ్ళ వైభవ్ సూర్యవంశీ సెంచరీ

Vaibhav Suryavanshi: బుడ్డోడు అనుకున్నార్రా..  14 ఏళ్ళ వైభవ్ సూర్యవంశీ సెంచరీ

Vaibhav Suryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఈ మ్యాచ్ లో మొత్తం 11 సిక్సర్లతో పాటు ఏడు బౌండరీలు కొట్టిన.. వైభవ్ సూర్య వంశీ… గుజరాత్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు.


Also Read: SRH- Don Film : అక్కినేని నాగార్జునను ట్రోల్ చేసిన SRH ప్లేయర్లు.. డాన్ మూవీ డైలాగ్ చెబుతూ

అనంతరం 101 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ… ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అప్పటికే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విషయం ఖరారు అయిపోయిందని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 209 పరుగులు చేసింది. ఇక ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్… 171 పరుగులు చేసింది. 45 బంతుల్లో 39 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది.


ఒక్క మ్యాచ్ తో వైభవ్ రికార్డులు

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ… ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్ గా ఐపిఎల్ హిస్టరీలో రెండవ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు వైభవ్ సూర్యవంశీ. అలాగే.. యంగెస్ట్ ప్లేయర్… సెంచరీ చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్ గా క్రిస్ గేల్ ఉన్నారు. ఆయన 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. క్రిస్ గేల్ తర్వాత వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో స్థానంలో యూసఫ్ పటాన్ 37 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ 38 బంతుల్లో చేయగా… ట్రావిస్ హెడ్ 39 బంతుల్లో చేశాడు. మొన్న ప్రియాంష్ ఆర్య 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

వైభవ్ సూర్య వంశీ ఐపీఎల్ ధర ఎంత ?

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంబంధించిన… 14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీని.. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది యాజమాన్యం. 2024 సంవత్సరం చివరలో ఐపీఎల్ మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీని కొనుగోలు చేసింది రాజస్థాన్ యాజమాన్యం. సౌదీలోని జెడ్డా వేదికగా ఈ మెగా వేలం జరగక… ఈ కుర్రాడు వేలంలోకి రాగానే వెంటనే కొనుగోలు చేసింది. రాహుల్ ద్రావిడ్ చొరవతో ఇతని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Also Read:  Kohli – KL Rahul: వివాదంలో విరాట్ కోహ్లీ… కన్నడీల తిరుగుబాటు.. RCB నుంచి ఔట్!

వైభవ్ సూర్యవంశంది ఏ రాష్ట్రం?

14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ బీహార్ రాష్ట్రంలో పుట్టి పెరిగాడు. అండర్ 19 టీం ఇండియా జట్టులో కూడా అద్భుతంగా రాణించి… మెగా వేలం వరకు వచ్చాడు. ఈ కుర్రాడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ తో పాటు… బౌలింగ్ కూడా చేస్తాడు. 2011 మార్చి 27వ తేదీన బీహార్ రాష్ట్రంలో జన్మించాడు.

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ

30 – క్రిస్ గేల్
35 – వైభవ్ సూర్యవంశీ
37 – యూసుఫ్ పఠాన్
38 – డేవిడ్ మిల్లర్
39 – ట్రావిస్ హెడ్
39 – ప్రియాంష్ ఆర్య

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×