Bees Attack Players : సాధారణంగా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రకరకాల సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల క్రికెట్ మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియంలో పాములు దర్శనం ఇవ్వడం.. మరికొన్ని సందర్బాల్లో కుక్కలు గ్రౌండ్ లోకి ప్రవేశించడం, మరికొందరూ యువకులు తమ అభిమాన క్రికెటర్లను కలిసి హగ్ చేసుకోవడం.. ఇలా రకరకాల సంఘటనలు చోటు చేసుకోవడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చెపాక్ వర్సెస్ మధురై మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. తేనె టీగలు దాడి చేశాయి. దీంతో క్రికెటర్లు నరకం అనుభవించారు. దీంతో మ్యాచ్ కొద్ది సేపు నిలిపివేశారట.
Also Read : Bipasha Basu: బిపాషా బసు అరాచకం… ఆ ప్లేయర్ తో ఘాటు రొమాన్స్.. !
తేనె టీగల దాడి.. నిలిచి పోయిన ఆట..
తేనె టీగలను వదిలించుకోవడానికి ఏమి చేయలేక.. గ్రౌండ్ మెన్లు చివరికీ పొగపెట్టి వాటిని తరిమివేశారు. మంట, పొగ కారణంగానే తేనె టీగలు మనుషులను కరవకుండా ఉంటాయి. లేదంటే అవి దాడి చేస్తే.. ఇక అంతే సంగతులు. దిండిగల్ లోని SPR కళాశాల మైదానంలో చెపాక్ సూపర్ గిల్లీస్, సీచెమ్ మధురై పాంథర్స్ జట్ల మధ్య జరిగిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో అనూహ్యంగా తేనెటీగలు దాడి చేయడంతో కొద్ది సేపు ఆట నిలిచిపోయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా తేనెటీగల సమూహం స్టేడియంలోకి ప్రవేవించి మ్యాచ్ కి అంతరాయం కలిగించాయి. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ సమయంలో తేనెటీగలు స్టేడియం పై తిరుగుతుడటం.. ఎస్.ఎస్. చతుర్వేద్ ని కుట్టాయి. ఇక ఫిజియో థెరపిస్ట్ వెంటనే మైదానంలోకి వెళ్లాడు. అలాగే విజయ్ శంకర్ ను కూడా తేనెటీగలు కలవరపెట్టాయి. అకస్మిక దాడితో చెపాక్ బ్యాటర్ భయాందోళనకు గురయ్యాడు.
CSG ఆరు వికెట్ల తేడాతో విజయం
తేనెటీగల కారణంగా 15 నిమిషాల తరువాత ఆట తిరిగి ప్రారంభం అయింది. క్రికెట్ లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది మొదటిసారి ఏమి కాదు.. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో తేనెటీగల దాడులు సాధారణం అయింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. CSG ఆరు వికెట్ల తేడా విజయాన్ని నమోదు చేసింది. అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం CSG ఏడు మ్యాచ్ ల్లో 14 పాయింట్లు సాధించి టాప్ లో కొనసాగుతోంది. 2019లో ఇంగ్లాండ్ లయన్స్ వైట్ బాల్ సిరీస్ కోసం ఇండియా ఏలో పర్యటించింది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో నాలుగో వన్డే మ్యాచ్ లో అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేశాయి. అప్పుడు కూడా దాదాపు 15 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో 28వ ఓవర్ లో తేనెటీగల గుంపు స్టాండ్ లోని అభిమానులపై దాడి చేయడంతో కొంత మంది ఆసుపత్రి పాలయ్యారు. స్టార్ ఆటగాళ్లకు మాత్రం ఎవ్వరికీ పెద్దగా గాయాలు కాలేదు. తేనె టీగలు వెళ్లిపోయాక 15 నిమిషాల తరువాత మ్యాచ్ జరిగింది. తాజాగా కూడా ఇలాగే జరగడం విశేషం.