OTT Movie : ఓటీటీలో ఒక హాలీవుడ్ హారర్ మూవీ మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇది హారర్ సినిమానే అయినా, కాస్త కామెడీని కూడా మిక్స్ చేశారు. ఈ కథ ఒక మంకీ బొమ్మ చుట్టూ తిరుగుతుంది. ఇది దానికున్న డ్రమ్‌ను వాయించిన ప్రతిసారీ భయంకరమైన మరణాలు జరుగుతుంటాయి. ఇందులో ప్రతీ సీన్ ఉత్కంఠంగా, ఆసక్తికరంగా సాగుతుంది ? ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ హారర్ మూవీ పేరు ‘ది మంకీ’ (The Monkey). 2025 లో వచ్చిన ఈ సినిమాకి ఓస్గూడ్ పెర్కిన్స్ దర్శకత్వం వహించారు.ఇది 1980లో స్టీఫెన్ కింగ్ రాసిన కథ ఆధారంగా రూపొందింది. ఇందులో థియో జేమ్స్, క్రిస్టియన్ కాన్వెరీ, కోలిన్ ఓ’బ్రియన్, ఆడమ్ స్కాట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 21 థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 98 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 6.0/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ 1999లో ఒక యాంటీక్ షాప్‌లో ప్రారంభమవుతుంది. అక్కడ పీటీ షెల్బర్న్ అనే వ్యక్తి , ఒక డ్రమ్ వాయించే కోతి బొమ్మను రిటర్న్ ఇవ్వడానికి వస్తాడు. అయితే ఆ బొమ్మ ఉన్నట్టుండి డ్రమ్‌ను వాయించడం మొదలు పెడుతుంది. దాని వల్ల షాప్ యజమాని దారుణంగా చనిపోతాడు.
ఆ తర్వాత స్టోరీ హాల్, బిల్ అనే కవల సోదరులకు మారుతుంది. వాళ్ళు తమ తండ్రి దాచిన ఒక కోతి బొమ్మను కనిపెడతారు. వాళ్ళు ఆ బొమ్మ కీని తిప్పినప్పుడు ఆ బొమ్మ డ్రమ్స్ వాయిస్తుంది. ఇంతలో వాళ్ళ దగ్గర పనిచేసే బేబీ సిట్టర్ , ఒక భయంకరమైన ప్రమాదంలో మరణిస్తుంది. ఈ బొమ్మ డ్రమ్ వాయించిన ప్రతిసారీ, ఎవరో ఒకరు భయంకరమైన రీతిలో మరణిస్తుంటారు. ఇది తెలుసుకున్న బిల్, హాల్‌ను బెదిరిస్తూ బొమ్మ కీని తిప్పాలని చూస్తాడు. కానీ దీనికి బదులుగా వీళ్ళ తల్లి లోయిస్ ఒక బ్రెయిన్ అనూరిజంతో మరణిస్తుంది. హాల్, బిల్ సోదరులు భయంతో ఈ బొమ్మను విసిరివేసి, తమ అత్త ఇడా, మామ చిప్ ఇంటికి వెళ్తారు. అయితే బొమ్మ తిరిగి అక్కడ కూడా కనిపిస్తుంది. బిల్ మళ్లీ ఆ బొమ్మ కీని తిప్పినప్పుడు, చిప్ ఒక గుర్రాల షెడ్ లో చనిపోతాడు. దీంతో మరింత భయపడిన సోదరులు, బొమ్మను ఒక బాక్స్‌లో మూసివేసి, దానిని ఒక బావిలో విసిరివేస్తారు. అది ఎప్పటికీ బయటికి రాకూడదని ఆశిస్తారు.
25 సంవత్సరాల తర్వాత ఇడా ఒక విచిత్రమైన ప్రమాదంలో ఇడా చనిపోతుంది. ఈ సంఘటనతో భయపడిన బిల్, హాల్ కు కాల్ చేస్తాడు. బొమ్మ తిరిగి వచ్చిందని అనుమానిస్తాడు. హాల్ ఇప్పటికీ గత గాయాలతో బాధపడుతూ, ఇడా ఇంటికి వెళ్తాడు. అక్కడ ఈ బొమ్మ మళ్లీ కనిపిస్తుంది. బిల్, హాల్‌తో ఉన్న తన పాత శత్రుత్వాన్ని మనసులో పెట్టుకుని, హాల్‌ను చంపడానికి బొమ్మను మళ్లీ ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇది ఒక అపోకలిప్టిక్ ఈవెంట్‌కు దారితీస్తుంది. ఇక్కడ బిల్ స్వయంగా ఒక ఫ్లయింగ్ బౌలింగ్ బాల్ ద్వారా చనిపోతాడు. ఆ తరువాత ఈ బొమ్మను మళ్లీ ఎవరూ ఉపయోగించకుండా , ఒక బ్యాగ్‌లో రాళ్లతో నింపి, ఒక నదిలో హాల్ విసిరేస్తాడు. చివరికి ఆ బొమ్మను హాల్ వదిలించుకుంటాడా ? దానికి ఇతను కూడా బలవుతాడా ? ఈ కోతి బొమ్మకి ఆ శాపం ఎలా వస్తుంది ? ఇంకెంతమంది దాని వల్ల పోతారు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : 17 మందిని లేపేసే లేడి కిల్లర్… కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ రివేంజ్ డ్రామా