Shine Tom chacko:విలక్షణ నటుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు షైన్ టామ్ చాకో(Shine Tom chacko). మలయాళ నటుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. తెలుగులో ‘దసరా’ సినిమా చేసి విలన్ గా తన అద్భుతమైన నటనతో అబ్బురపరిచారు. ఇదిలా ఉండగా ఇటీవల డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఈయన.. ఇదే నెల కారు ప్రమాదానికి గురై తండ్రిని కోల్పోయిన విషయం తెలిసిందే. అటు ఈ ప్రమాదంలో తల్లి, తమ్ముడు, ఈయనకి కూడా గాయాలైనట్లు తెలిసిందే. అయితే ఈ విషాదకరమైన కారు ప్రమాదం గురించి తొలిసారి స్పందించారు షైన్ టామ్ చాకో. అసలు విషయంలోకెళితే.. జూన్ 6వ తేదీన సేలం – బెంగళూరు జాతీయ రహదారిపై ధర్మపురి జిల్లాలోని హోగేనక్కల్ పాలక్కోట్ పరయూర్ వద్ద ఉదయం 6:30 గంటల ప్రాంతంలో షైన్ టామ్ చాకో తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఇక ఆ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మిగతా వారిని స్థానికులు హాస్పిటల్ కి తరలించారు.
సహాయం కోసం రోడ్డుపైనే అడుక్కున్నాను – షైన్ టైమ్ చాకో
ఇకపోతే ఈ ప్రమాదంపై తొలిసారి స్పందించారు షైన్ టామ్ చాకో. దీనిపై ఆయన మాట్లాడుతూ..” ఆరోజు ఉదయం అమ్మానాన్న , నేను, నా సోదరుడు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నేను వెనుక సీటులో కూర్చొని నిద్రపోతున్నాను. ఒక్కసారిగా లేచి చూస్తే మా కారుకి ప్రమాదం జరిగిపోయింది. ఏం అర్థం కాలేదు. దీంతో ఎవరైనా మమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్లండి అని ఏడ్చేశాను. ఒకరకంగా చెప్పాలంటే సహాయం కోసం రోడ్డుపైనే అడుక్కున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సహాయం కోసం ఇంత బాధ పడ్డారా అంటూ అభిమానులు సైతం కన్నీటి పర్యంతం అవుతున్నారు. మొత్తానికి అయితే షైన్ టామ్ చాకో చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆయన లేని జీవితం భయంకరంగా మారింది – షైన్ టామ్ చాకో
ఇదిలా ఉండగా యాక్సిడెంట్ అయిన రోజు ఈయనను మీడియా మిత్రులు ప్రశ్నించగా.. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ..” త్రిస్సూర్లో కారు ఎక్కిన దగ్గర్నుంచి నాన్న తన జోకులతో మమ్మల్ని నవ్వించాడు. మేము పాలక్కాడ్ లో కలిసి భోజనం చేసాము. నాన్న నవ్విస్తూనే ఉన్నారు. ఆ తర్వాత నిద్రలోకి జారుకున్నాము. మా నాన్న నాతో మాట్లాడడం ఎప్పుడు మేము విసుగు చెందలేదు. సరైన అంశం లేనప్పుడు యాదృచ్ఛికంగా కూడా గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటి మా నాన్న ఈరోజు లేకపోవడం ఇది నాకు అత్యంత భయంకరమైన పరిస్థితిగా మారిపోయింది” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు షైన్ టామ్ చాకో. ఇక ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Kannappa Collection 2nd Day :కన్నప్పకు కష్టాలు.. ఈ కలెక్షన్స్ తోనే ఇండస్ట్రీ హిట్ అయిపోద్దా?