BigTV English

IND vs NZ: న్యూజిలాండ్‌కు మరో ఎదురు దెబ్బ.. మరో ప్లేయర్ ఔట్‌ !

IND vs NZ: న్యూజిలాండ్‌కు మరో ఎదురు దెబ్బ.. మరో ప్లేయర్ ఔట్‌ !

IND vs NZ:  టీమ్ ఇండియా (India) వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి అంటే బుధవారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టులు జరగనున్నాయి. అయితే.. మొదటి టెస్ట్ బెంగళూరు వేదికగా.. జరగనుంది. దీంతో ఇప్పటికే న్యూజిలాండ్ అలాగే టీమ్ ఇండియా జట్లు బెంగళూరుకు చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది.


మరో కీలక ప్లేయర్ న్యూజిలాండ్ జట్టును వీడనున్నాడు. ఇప్పటికే కెన్ విలియమ్స్ సన్ మొదటి టెస్ట్ మ్యాచ్ కు దూరమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన రెండో టెస్ట్ కూడా ఆడేది నమ్మకమే లేదు. అయితే ఆ షాక్ లో ఉన్న న్యూజిలాండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్‌ (Ben Sears) టీమిండియా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అంటే మళ్ళీ న్యూజిలాండ్ కు వెళ్లిపోనున్నాడు ఈ ఫాస్ట్ బౌలర్.

 


మోకాలి గాయం కారణంగా ఈ టెస్ట్ సిరీస్ మొత్తానికి.. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్‌ (Ben Sears) దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే బెన్ స్థానంలో అన్ క్యాప్డ్ ప్లేయర్గా జాకబ్ డఫీ ని (Jacob Duffy) ఇప్పటికే సెలెక్ట్ చేశారు. అతన్ని.. జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. వాసవంగా శ్రీలంక పర్యటనలోనే బెన్ సియర్స్‌ (Ben Sears)… మోకాలి నొప్పితో చాలా ఇబ్బందిపడ్డాడు.

Also Read: IND vs NZ 2024 Test Series: రేపటి నుంచే టెస్టు సిరీస్… హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

అయితే ఆ తర్వాత కాస్త ఆయన గాయం సద్దుమణిగింది. కానీ టీమిండియా మ్యాచ్కు ఒక రోజు ముందే గాయం మళ్ళీ తిరగబడింది. ఈ తరుణంలోనే… బెన్ సియర్స్‌ (Ben Sears) స్కానింగ్ కూడా చేయించుకున్నాడట. అయితే డాక్టర్లు నెలరోజుల పాటు… బెన్ ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలని సూచనలు చేశారట. దీంతో టీమ్ ఇండియా సిరీస్ నుంచి న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బెన్ తప్పుకున్నాడు. అయితే.. బెన్ సియర్స్‌ (Ben Sears) స్థానంలో వస్తున్న న్యూజిలాండ్ ప్లేయర్ జాకబ్ (Jacob).. కు పెద్దగా అనుభవం లేదు. అతను ఆరు వన్డేలు అలాగే 14 t20 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఏకంగా 269 వికెట్లు పడగొట్టిన మొనగాడిగా… జాకాబ్ కు రికార్డు ఉంది. అందుకే బెన్ని స్థానంలో అతన్ని తీసుకున్నారు.

న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల కోసం భారత జట్టును ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ జట్టులో రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (విసి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్), ధ్రువ్ జురెల్ (వికె), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ ఉన్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×