Watch Video : క్రికెట్‌లో అనేక వింత సంఘటనలు జరుగుతుంటాయి. మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా గల్లీ క్రికెట్ లో అయిన చిత్ర, విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో బౌలర్లు రివర్స్ బంతి వేసి బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడం, లేదా బ్యాట్స్‌మెన్లు రివర్స్‌లో బ్యాటింగ్ చేసి సిక్సులు, ఫోర్లు కొట్టడం వంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ, ఇండియాలో గల్లీ క్రికెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. పంట పొలాల వద్ద, గల్లీలలో, చిన్న చిన్న మైదానాలలో, పాఠశాలలు, కళాశాలల్లో కూడా క్రికెట్ ఆడుతుంటారు. పండుగ సమయాల్లో చిన్న చిన్న గ్రామాలలో టోర్నమెంట్లను కూడా నిర్వహిస్తారు, ఆ ఆటలలో వివిధ రకాల బంతులను ఉపయోగిస్తారు.
Also Read : Viral video: “సిరాజ్ దెబ్బ.. స్టోక్స్ అబ్బా”.. బెన్ స్టోక్స్ బాక్స్ బద్దలైంది..!
వుడ్ బ్యాట్.. అదుర్స్..
ఇప్పుడు రకరకాల బంతులతో పాటు రకరకాల బ్యాట్స్ లను కూడా వినియోగిస్తున్నారు. బ్యాట్ లు చెక్క బ్యాట్, ప్లాస్టిక్ బ్యాట్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. తక్కువ ధరకు ప్లాస్టిక్ బ్యాట్లకు మంచి గిరాకీ లభిస్తోంది. చెక్క బ్యాట్లకు ధర ఎక్కువ.. బరువు ఎక్కువ అని యువకులు, కాలేజీ కుర్రాళ్లు ఎక్కువగా ప్లాస్టిక్ బ్యాట్లతోనే క్రికెట్ ఆడుతున్నారు. పల్లెటూర్లలో ఈ మధ్య ప్లాస్టిక్ బ్యాట్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పవచ్చు. ప్లాస్టిక్ బ్యాట్లు, టెన్నిస్ బంతులతో క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నారు. కొన్ని పండుగ వేళలలో అయితే.. వీటి వినియోగం విపరీతంగా ఉంటుంది. తాజాగా ఓ బ్యాట్ వైరల్ అవుతోంది. అది వుడ్ తో తయారు చేసిన బ్యాట్.. ఆ బ్యాట్ చాలా వెడల్పు కలిగి ఉండటంతో బంతి ఎంత దూరంతో వచ్చినా.. ఎంత హైట్ లో వచ్చినా బ్యాట్ తో చాలా సులభంగా పరుగులు చేయవచ్చు. దీంతో బ్యాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కొత్త బ్యాట్.. కొత్త ఆట
క్రికెట్ లోకి సరికొత్త బ్యాట్ వచ్చేసింది అని.. ఈ బ్యాట్ తో సిక్స్ లు, ఫోర్లు బాదొచ్చని ఎవ్వరికీ నచ్చింది వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటీవల పంజాబ్ లో జరిగిన ఓ క్రికెట్ టోర్నమెంట్ లో ఓ యువకుడు వినూత్న బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఏ చేతితో బౌలింగ్ చేస్తున్నాడో అసలు బ్యాటర్లకు అర్థం కాలేదు. ఈ తికమక బౌలింగ్ బంతిని అంచనా వేయలేక బ్యాటర్లు పెవిలియన్ కి చేరారు. దీంతో ఆ యువ బౌలర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ఎడమ చేతితో బాల్ అందుకున్నటువంటి ఆ బౌలర్.. చేతులను మార్చి వెనక్కి, ముందుకు తిప్పుతూ.. ఓ చేతి నుంచి మరో చేతికి బాల్ మార్చుతూ చివరికీ కుడి చేతితో బౌలింగ్ చేశాడు. ఇదంతా గమనించిన బ్యాటర్ కి ఏం అర్థం కాకపోవడం.. క్లీన్ బౌల్డ్ కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. తాజాగా సూరత్ లో జరిగిన టెన్నిస్ బంతి.. క్యాప్ కి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
?igsh=MTQ5OGtleWQ1aWo1Nw==