BigTV English

Viral video: “సిరాజ్ దెబ్బ.. స్టోక్స్ అబ్బా”.. బెన్ స్టోక్స్ బాక్స్ బద్దలైంది..!

Viral video: “సిరాజ్ దెబ్బ.. స్టోక్స్ అబ్బా”..  బెన్ స్టోక్స్ బాక్స్ బద్దలైంది..!

Viral video: భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ లో ఇంగ్లాండ్ పట్టు బిగించింది. బ్యాటర్లు రాణించడంతో శుక్రవారం రోజు ఇంగ్లాండ్ భారీ స్కోర్ నమోదు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సరికి 135 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 186 పరుగుల ఆదిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ 150, బెన్ డక్కెట్ 94, జాక్ క్రాలే 84, బెన్ స్టోక్స్ 77, పోప్ 71 పరుగులు చేశారు.


Also Read: Dhruv Jurel: ఒరేయ్ దద్దమ్మ… కీపింగ్ సరిగ్గా చేయరా.. జురెల్ పై దారుణంగా ట్రోలింగ్స్!

అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వికెట్ల వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కాసేపు నొప్పితో విలవిల్లాడాడు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో కొద్దిసేపటి తర్వాత ఆ నొప్పి తట్టుకోలేక స్టోక్స్ రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?


ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 91 ఓవర్ లో మహమ్మద్ సిరాజ్ వేసిన వేగవంతమైన బంతిని బెన్ స్టోక్స్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి ఎక్కువగా బౌన్స్ కావడంతో గార్డ్ వేసుకునే చోట బలంగా తాకింది. దీంతో బెన్ స్టోక్స్ ఒక్కసారిగా నొప్పి భరించలేక వికెట్ల వద్దే కుప్పకూలిపోయాడు. సుమారు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకు వచ్చిన ఆ బంతి ధాటికి బెన్ స్టోక్స్ క్రీజ్ లోనే కుప్పకూలిపోయాడు. దీంతో నొప్పి భరించలేక స్టోక్స్ నేలపై పడుకుని విలవిల్లాడాడు.

ఈ దృశ్యం చూసి మైదానంలో ఉన్న భారత ఆటగాళ్లు కూడా వెంటనే అతడి వద్దకు వెళ్లి పరామర్శించారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా వెంటనే అతడి దగ్గరికి వచ్చి.. “బలంగా తాకిందా” అని అడిగి తెలుసుకున్నాడు. కొద్దిసేపు నొప్పితో బాధపడ్డ స్టోక్స్.. ఆ తర్వాత తేరుకొని అలాగే బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ సమయంలో అతడు చేసింది కేవలం 13 పరుగులే. మధ్యలో ఫిజియో తో చికిత్స కూడా తీసుకున్నాడు. ఆ తరువాత నెమ్మదిగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

అయితే నొప్పి తీవ్రం కావడంతో 116 ఓవర్ లో 66 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిటైర్డ్ హార్ట్ గా పెవిలియన్ కి వెళ్లిపోయాడు. ఇక ఏడవ వికెట్ పడ్డాక తిరిగి మళ్లీ క్రీజ్ లోకి వచ్చాడు. ఇక స్టోక్స్ కి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు.. “పాపం స్టోక్స్.. బాక్స్ బద్దలైంది” అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Asia Cup 2025 schedule: ఇండియా-పాక్ మ్యాచ్ కు ముహూర్తం ఫిక్స్… ఎప్పుడంటే

ఈ టెస్ట్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. ఓ టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల ఘనతతో పాటు హాఫ్ సెంచరీ నమోదు చేసిన మూడవ ఇంగ్లాండ్ కెప్టెన్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో తన బౌలింగ్ తో ఐదు వికెట్లు పడగొట్టిన స్టోక్స్.. బ్యాటింగ్ తో 77 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్నాడు. గత 89 ఏళ్లలో ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లాండ్ కెప్టెన్ గా బెన్ స్టోక్స్ నిలిచాడు. స్టోక్స్ కంటే ముందు స్టాన్ లీ జాక్సన్, గబ్బీ అలెన్ ఈ ఫీట్ సాధించారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×