Salman Ali Agha : ఆసియా కప్ 2025 లో ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇక రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఒమన్ ఓడించిన దాని కంటే చెత్తగా టీమిండియాను ఓడిస్తామని పేర్కొన్నాడు. తమ ప్రణాళికలను పక్కా అమలు చేస్తామని.. అవి అమలు చేస్తే ఏ జట్టునైనా ఓడిస్తామన్నారు. భారత్ మ్యాచ్ గురించి ఎదరైన ప్రశ్న గురించి ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు. .. మా బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. బ్యాటింగ్ లో ఇంకా బెటర్ అవ్వాలి. ఇటీవల మా ఆట తీరు బాగుంది. ట్రై సిరీస్ ను కూడా అలవొకగా గెలిచాంష అని తెలిపారు సల్మాన్ అలీ అఘా.
Also Read : Asia Cup 2025 : ఆసియా కప్ లో టీమిండియా కు ఎదురు దెబ్బ.. దుబాయ్ నుంచి వచ్చేసిన వాషింగ్టన్ సుందర్
మరోవైపు రేపు ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవలే పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ తన్వీర్ అహ్మద్ టీమిండియా బౌలర్ బుమ్రా పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా పాకిస్తాన్ ఓపెనర్ అయూబ్.. బుమ్రా బౌలింగ్ లో 6 బంతుల్లో 6 సిక్స్ లు కొడతాడని చెప్పడం గమనార్హం. అయితే నిన్న ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో అయూబ్ డకౌట్ అయ్యాడు. అలాగే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కూడా డకౌట్ కావడం గమనార్హం. మరోవైపు తాజాగా టీమిండియా ఆటగాళ్లు, ఫ్యాన్స్ మాత్రం పాకిస్తాన్ చిత్తుగా ఓడించడానికి జూనియర్ జట్టులో ఉన్న వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య వంటి ఐపీఎల్ స్టార్లు చాలు అని పేర్కొంటున్నారు.
మరోవైపు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ ద్వితీయ శ్రేణి జట్టు సరిపోతుందని కొందరూ అభిప్రాయపడుతున్నారు. వారిలో ముఖ్యంగా టీమిండియా మాజీ పేసర్ అతుల్ వాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి 1990లో పాకిస్తాన్ జట్టు పటిష్ట జట్టుగా ఉండేదని.. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. ఆ జట్టు చాలా బలహీనంగా కనిపిస్తోందన్నారు. ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్ ను ఓడించేందుకు టీమిండియా-బీ జట్టు సరిపోతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మరోవైపు టీ-20 వరల్డ్ కప్ 2024 భారత్ ఛాంపియన్ గా నిలిచిన తరువాత కోహ్లీ.. రోహిత్ అంతర్జాతీయ టీ-20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే కోహ్లీ, రోహిత్ టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ జట్టు విజయం సాధిస్తుందో వేచి చూడాలి మరీ.