Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం రోజున టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలోనే… టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ పై టీమిండియాకు చెందిన మాజీ క్రికెటర్, కోచ్ స్టాఫ్ అభిషేక్ నాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓడితే… పెను ప్రమాదం పొంచి ఉంటుందని బాంబ్ పేల్చారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడితే.. ప్లేయర్లను దేవుడు కూడా కాపాడబోడని తాజాగా వెల్లడించారు. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ యుద్దం జరిగిన తరుణంలోనే.. ఈ పరిస్థితి ఉంటుందని అంచనా వేశారు. కచ్చితంగా ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచి తీరాల్సిందేనన్నారు అభిషేక్ నాయర్. లేకపోతే.. టీమిండియా ప్లేయర్లను భారతీయులు టార్గెట్ చేస్తారన్నారు. జాగ్రత్తగా ఆడి… టీమిండియా గెలవాల్సిందేనన్నారు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14వ తేదీ అంటే ఇప్పుడు ఆదివారం జరుగనుంది. భారత కాలమానం ప్రకారం….ఆదివారం రాత్రి 8 గంటలకు టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. సోనీ లివ్, స్టార్ స్పోర్ట్స్ లో మ్యాచ్ జరుగనుంది. ఉచితంగా చూసే అవకాశం లేనే లేదు. సోనీ లివ్ లో చూడాలంటే... కచ్చితంగా సబ్ స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది.
గత 3 నెలల కిందట భారత్ , పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి రెండు దేశాల మ్యాచ్ లు నిర్వహించకూడదని అందరూ డిమాండ్ చేశారు. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్ కోరారు. అయినా కూడా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం రోజున టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. దీనిపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇలాంటి నేపత్యంలోనే.. అభిషేక్ నాయర్ స్పందించారు. ఈ మ్యాచ్ లో టీమిండియా క చ్చితంగా గెలవాలని ఆయన వెల్లడించారు. లేకపోతే.. టీమిండియా క్రికెటర్లకు అభిమానులు, భారతీయులు చుక్కలు చూపిస్తారని అంటున్నారు.
టీమిండియా XI అంచనా : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.
పాకిస్థాన్ XI అంచనా : సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, ఫఖర్ జమాన్, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), సల్మాన్ అఘా (కెప్టెన్), హసన్ నవాజ్, షాహీన్ షా ఆఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముఖీమ్.
"If they don't win this tournament, there is something that's gone wrong" – Abhishek Nayar on India ahead of IND vs PAK Asia Cup 2025 clash https://t.co/r8dtWfNwPt pic.twitter.com/KrrgjIPIo5
— Sportskeeda (@Sportskeeda) September 12, 2025