Bird flu Death: ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేగింది. వైరస్ కారణంగా తొలి మరణం సంభవించింది. పల్నాడు జిల్లా నరసరరావుపేటకి చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూ వైరస్ కారణంగానే మృతి చెందిందని భారత పరిశోధన వైద్య మండలి నిర్ధారించింది.
గత నెల 16న చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పచ్చి కోడి మాంసం తినడం వల్లనే చిన్నారికి బర్డ్‌ఫ్లూ వచ్చిందని అనేక వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తేల్చింది. చిన్నారి తల్లిదండ్రులను వైద్యశాఖ అధికారులు కలిసి వివరాలు సేకరించారు.
చిన్నారి మారాం చేస్తే పచ్చి మాంసం ముక్క తినడానికి ఇచ్చినట్లు.. వైద్య శాఖ అధికారులకు చిన్నారి తల్లితండ్రులు చెప్పారు. బర్డ్‌ఫ్లూ నిర్ధారణతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది.
కాగా, బర్డ్‌ఫ్లూ కారణంగా మనుషి చనిపోవడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. బర్డ్‌ఫ్లూ వైరస్ దృష్ట్యా ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.