Travis Head: భారత జట్టుకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావీస్ హెడ్ పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. టీమిండియా అంటే చాలు ఫార్మాట్ తో సంబంధం లేకుండా చెలరేగిపోతున్నాడు హెడ్. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ లోను భారత బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో 13 పరుగులు మాత్రమే చేసిన హెడ్.. హర్షిత్ రానా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.
Also Read: Virat Kohli – sam Konstas: 19 ఏళ్ల కుర్రాడితో గొడవ.. విరాట్ కోహ్లీపై నిషేధం ?
ఇక రెండో ఇన్నింగ్స్ లో 89 పరుగులు రాబట్టిన ఈ ఆస్ట్రేలియా బ్యాటర్ బూమ్రా బౌలింగ్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక రెండవ టెస్ట్ లోను 140 పరుగులు చేసి.. ఆసీస్ సిరీస్ ని సమం చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అడిలైడ్ టెస్ట్ లో హెడ్ శతకంతో ఆకట్టుకున్నాడు. అతడిని అవుట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు సిరాజ్ అద్భుత యార్కర్ తో అతడికి చెక్ పెట్టాడు. అలాగే గబ్బా వేదిక జరిగిన మూడో టెస్ట్ లో నూ సెంచరీతో చెలరేగాడు.
అయితే ఒకే ఏడాదిలో ఒకే వేదికపై రెండు ఇన్నింగ్స్ లోనూ గోల్డెన్ డకౌట్ కావడంతోపాటు, అదే వేదికపై సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా నిలిచాడు హెడ్. ఇక మేల్ బోర్న్ వేదికగా జరిగే నాలుగోవ (బాక్సింగ్ డే) టేస్ట్ లో ఈ డేంజరస్ బ్యాటర్ ని అడ్డుకునేందుకు భారత్ ప్రత్యేక వ్యూహాలను రచించింది. హెడ్ ని ఎలాగైనా ఆదిలోనే పెవీలియన్ కి పంపాలని రోహిత్ అండ్ కో వ్యూహాలు రచించి సక్సెస్ అయ్యింది. బాక్సింగ్ డే టేస్ట్ తొలి ఇన్నింగ్స్ లో హెడ్ డకౌట్ అయ్యాడు.
జస్ ప్రీత్ బూమ్రా అద్భుతమైన బంతితో హెడ్ ని క్లీన్ బోల్డ్ చేశాడు. ఏడు బాల్స్ ఆడిన హెడ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. 67వ ఓవర్ వేసిన బూమ్రా మూడో బంతిని హెడ్ కి ఆఫ్ స్టంప్ దిశగా గుడ్ లెంత్ డెలివరీ సంధించాడు. దీంతో ఈ బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన హెడ్.. బంతిని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
Also Read: Sam Konstas: బుమ్రా బౌలింగ్ లో తొలి సిక్స్ కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు…చరిత్రలో తొలిసారి!
కానీ ఆ బంతి వైడ్ ఆఫ్ స్టంప్ వెలుపల పడి అద్భుతంగా స్వింగ్ అయ్యి ఆఫ్ స్టంప్ ను తగిలింది. దీంతో హెడ్ మైండ్ బ్లాంక్ అయింది. ఈ నేపథ్యంలో హెడ్ అవుట్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ పై హెడ్ డకౌట్ కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 311 పరుగులు చేసి 6 వికెట్లను కోల్పోయింది. స్టీవ్ స్మిత్ (68*), పాట్ కమీన్స్ (8*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో బూమ్రా మూడు వికెట్లు, ఆకాష్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ సాధించారు.
“Game-changer player is only one guy JASPRIT BUMRAH!" 💪😎#TravisHead "leaves" without troubling the scorers! 🫢#AUSvINDOnStar 👉 4th Test, Day 1 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/p6a0gzc3BB
— Star Sports (@StarSportsIndia) December 26, 2024