Neymar Junior : సాధారణంగా కొందరూ సేవా భావం గల వారు ఉంటారు. మరికొందరూ మాత్రం సేవా గుణం తక్కువ..సంపాదించుకోవాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి ఈ రంగంలోనైనా సేవ చేసే వారు చాలా తక్కువ మందే ఉంటారు. కొందరూ ఎవరైనా సహాయం చేస్తే.. ఆ దేవుడు మాకు సాయం చేస్తారని కొందరూ ఆలోచిస్తే.. మరికొందరూ మాత్రం ఎవ్వరికీ సాయం చేస్తే మనకేమీ వస్తుంది. మనకెవ్వడు ఏమి ఇవ్వడు కదా అనే ఆలోచనలు ఇలా రకరకాలుగా వస్తుంటాయి. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..? ఓ అజ్ఞాత బిలియనీర్ బ్రెజిల్ ఫుట్ బాల్ సూపర్ స్టార్ నెయ్ మర్ పై ఉన్నటువంటి అభిమానంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటివరకు అతడిని ఒక్కసారి కూడా కలువకుండానే తన యావదాస్తిని రాసిచ్చాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం.
Also Read : Ross Taylor : రాస్ టేలర్ తో రెండు దేశాల తరఫున ఆడిన క్రికెటర్లు వీళ్లే… లిస్టు పెద్దదే
బ్రెజిల్ లోని పోర్టో అలెగ్రికి చెందిన యంగ్ బిజినెస్ మెన్ (31) రాసినటువంటి వీలునామా బయటికి వచ్చింది. వాస్తవానికి బ్రెజిల్ రియల్స్ లో 6.1 బిలియన్ అంటే.. భారత కరెన్సీలో దాదాపు 10వేల కోట్లు అన్నమాట. ఇంత విలువైన తన యావదాస్తిని ఫుట్ బాల్ సూపర్ స్టార్ నెయ్ మర్ కి దక్కాలని ఆ బిజినెస్ మెన్ తన వీలునామాలో రాశాడు. దీంతో బ్రెజిల్ మీడియా దీనిపై పలు కథనాలను వెల్లడించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరిగి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే ఆ యంగ్ బిజినెస్ మెన్ 31 సంవత్సరాల వయస్సులోనే మరణించగా.. అతనికి భార్య, పిల్లలు లేరని బ్రెజిల్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. 2025 జూన్ 12వ తేదీన ఆ వీలునామాను అధికారికంగా రిజిస్టర్ చేయించినట్టు సమాచారం.
వాస్తవానికి ఆ యంగ్ బిజినెస్ మెన్ కి నెయ్ మర్ తో ఎలాంటి వ్యక్తి గత, వృత్తి పరమైన సంబంధం కూడా లేదు. అయితే పుట్ బాల్ ప్లేయర్ కి యావదాస్తి ని రాసి ఇవ్వడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. నెయ్ మర్ పట్ల ఉన్న ఆరాధనా భావంతోనే ఆ వ్యాపారవేత్త ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నాకు నెయ్ మర్ అంటే చాలా ఇష్టం. అతన్ని చూసినప్పుడల్లా నన్ను నేను చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది. తండ్రితో నెయ్ మర్ అనుబంధం నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది. కేవలం అతడు అథ్లెట్ మాత్రమే కాదు. కుటుంబం విలువలు తెలిసిన గొప్ప వ్యక్తి ష అని వీలునామాలో రాశాడు. ఈ వార్తలపై నెయ్ మర్ టీమ్ స్పందించింది. తమకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీలునామా కోర్టు పరిధిలో ఉంది. దీనిని సవాల్ చేస్తూ.. పిటిషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఫైనల్ గా ఆ ఆస్తి ఎవ్వరికీ దక్కుతుందో వేచి చూద్దాం.