Ross Taylor : సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరు చాలా తొందరలో రిటైర్మెంట్ అయితే.. మరికొందరూ చాలా ఆలస్యంగా క్రికెట్ కి రిటైర్మెంట్ కి చెబుతుంటారు. కొందరూ అద్భుతంగా ఆడితే.. మరికొందరూ పేలవ ప్రదర్శన కనబరుస్తుంటారు. ఇలా చిత్ర, విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవి మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కొందరూ తమ దేశానికి క్రికెట్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత మళ్లీ రి ఎంట్రీ ఇస్తే.. ఇంకొందరూ మరో దేశం తరపున ఆడటానికి రీ ఇంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ ఇలాగే చేయబోతున్నాడు. తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తన తల్లి పుట్టిన సమోవా దేశం తరపున త్వరలో బరిలోకి దిగనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ఆ దేశ పాస్ పోర్ట్ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. 41 ఏళ్ల టేలర్ వీస్ తరపున అన్ని ఫార్మాట్లలో కలిపి 18 వేలకు పైగా పరుగులు సాధించారు. 2022లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగారు.
సామీ గిల్లెన్ :
ప్రముఖ క్రికెటర్ సామీ గిల్లెన్ స్పెయిన్ లో జన్మించాడు. ఇతను వెస్టిండీస్, న్యూజిలాండ్ రెండు జట్ల తరపున ఆడాడు.
ల్యూక్ రోంచి :
ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ ల్యూక్ రోంచీ ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. మళ్లీ రెండు జట్లకు కోచ్ గా వ్యవహరించాడు. క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ రెండింటికీ ఆడిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.
మిచెల్ రిప్పన్ :
వాస్తవానికి మిచెల్ రిప్పన్ అనే క్రికెటర్ సౌతాఫ్రికా చెందిన వాడు. కానీ న్యూజిలాండ్, నెదర్లాండ్ తరపన అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడటం విశేషం. లెప్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్.
కోరీ అండర్సన్ :
కోరీ అండర్సన్ న్యూజిలాండ్ లో జన్మించిన అమెరికన్ క్రికెటర్. ఇతను న్యూజిలాండ్, అమెరికా దేశాల తరపున అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాడు.
మార్క్ చాప్మన్ :
మార్క్ చాప్మన్ హాంకాంగ్ లో జన్మించిన న్యూజిలాండ్ క్రికెటర్. ఇతను హాంకాంగ్, న్యూజిలాండ్ రెండు దేశాల తరపున అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ మ్యాచ్ లను ఆడాడు. ప్రస్తుతం ఇతను న్యూజిలాండ్ తరపున ఆడుతున్నాడు.
టామ్ బ్రూస్ :
న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు టామ్ బ్రూస్.. ఇతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తొలి ట్రిపుల్ సెంచరీని 401 బంతుల్లో 345 పరుగులు సాధించాడు.
రాస్ టేలర్ :
రాస్ టేలర్
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. అయితే అతను 2021లో అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు. ఐపీఎల్ లో తొలుత ఆర్సీబీ తరపున ఆడాడు. ఆ తరువాత రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డేవిల్స్, పూణే వారియర్స్ వంటి జట్ల తరపున ఆడాడు. 2020లో చివర్లో గయానా అమెజాన్ వారియర్స్ తరపున ఆడాడు. టేలర్స్.
ఇప్పటివరకు న్యూజిలాండ్ తరపున ఆడి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత.. ప్రస్తుతం సమోవా దేశం తరపున ఆడేందుకు సిద్ధం అవుతున్నాడు. త్వరలోనే ఆడనున్నట్టు సమాచారం.