BigTV English

IND vs SA T20 WC 2024 Final Match: ముగ్గురు స్పెషలిస్టు బ్యాటర్లతోనే వెళతారా?

IND vs SA T20 WC 2024 Final Match: ముగ్గురు స్పెషలిస్టు బ్యాటర్లతోనే వెళతారా?

Can India go With only Three Specialist Batters in 2024 T20 WC Final against SA: టీమ్ ఇండియా ఫైనల్ వరకు వచ్చిందంటే, కొంచెం అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి. లేకపోతే టీ 20 ప్రపంచకప్ మొదలైన దగ్గర నుంచి ముగ్గురే స్పెషలిస్టు బ్యాటర్లు ఉన్నారు. వారితోనే ధైర్యంగా దిగి ఇంతవరకు వచ్చారు. ఇందులో కూడా కొహ్లీ పాత్ర లేదనే చెప్పాలి. అలా చూస్తే స్పెషలిస్టు బ్యాటర్లు  ఇద్దరే ఉన్నట్టు అనుకోవాలి.


అయితే రోహిత్ శర్మ చివరి రెండు మ్యాచ్ ల్లో లయ అందుకున్నాడు, కాబట్టి బతికిపోయారు. లేదంటే ఈ పాటికి తిరుగు విమానం ఎక్కేవారే. ఇక సూర్య కూడా బాధ్యతగా ఆడుతున్నాడు. వీళ్లు ముగ్గురూ అయిపోతే ఇండియా సినిమా అయిపోయినట్టుగానే ఉంది.
కాకపోతే20 ఓవర్ల మ్యాచ్ వల్ల పెద్దగా తేడా తెలీడం లేదు. 8వ నెంబర్ వరకు ఆల్ రౌండర్లు ఉండటం వల్ల, తలా ఒక ఓవర్ ఫటాఫట్ కొట్టి అయిపోతున్నారు.ఈలోపు 20 ఓవర్లు అయిపోతున్నాయి. దీంతో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎలాగోలా గెలిచారులే అనుకుంటున్నారు.

వీళ్లు ముగ్గురి తర్వాత రిషబ్ పంత్ ఆల్ రౌండర్.. తను మొదట నాలుగు మ్యాచ్ లు క్లిక్ అవడం భారత్ కి కలిసి వచ్చింది. తర్వాత హార్దిక్ పాండ్యా ఫామ్ లో ఉండటం వల్ల ఫినిషింగ్ బాగా కుదురుతోంది. ఇక శివమ్ దుబె కూడా ఆశించినంతగా ఆడటం లేదు. ఇంతవరకు తన స్కోరు చూస్తే.. 0, 28, 34, 10, 31*, 3, తాజాగా సెమీఫైనల్ లో గోల్డెన్ డక్‌ కూడా అయ్యాడు.


Also Read: విరాట్ కొంచెం టైమ్ తీసుకుని ఆడు: రవిశాస్త్రి

నిజానికి గ్రూప్ దశలో పాకిస్తాన్ తో ఓడిపోవాల్సిన మ్యాచ్ అది. అత్యంత ‘లో స్కోరు’ మ్యాచ్ ని బౌలర్లు గెలిపించారు. ముఖ్యంగా బుమ్రా అద్భుతంగా బౌలింగు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఇప్పటికి 7 మ్యాచ్ లు జరిగితే ఎక్కువసార్లు బౌలర్లే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోవడం విశేషం.

బుమ్రా రెండుసార్లు, అర్షదీప్ ఒకసారి, అక్షర్ పటేల్ ఒకసారి, అంతేకాదు ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యా కూడా ఒకసారి అందుకున్నారు. మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఒకటి సూర్య, రెండు కెప్టెన్ రోహిత్ శర్మ అందుకున్నారు.

ఈసారి కూడా టీమ్ ఇండియా బౌలర్లపైనే భారమంతా పడుతోంది. మరి ఆడాల్సిన ఆఖరి ఫైనల్ మ్యాచ్ లో ఎలా ఆడతారో వేచి చూడాల్సిందే.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×