Vinod Kambli: టీమిండియా మాజీ క్రికెటర్, ఒకప్పటి సంచలన ఆటగాడు వినోద్ కాంబ్లీ {53} ఆరోగ్యం ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఆయన తమ్ముడు వీరేంద్ర కాంబ్లీ వెల్లడించారు. వినోద్ గత ఏడాది అక్టోబర్ లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ తో పాటు, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో కూడా బాధపడుతున్నారు. 2024 డిసెంబర్ 21న ఆసుపత్రిలో చేరిన కాంబ్లీ.. చికిత్స అనంతరం కాస్త మెరుగుపడ్డారు. కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి నడవలేని స్థితిలో ఉన్నట్లు ఆయన తమ్ముడు వీరేంద్ర తెలియజేశారు.
Also Read: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ కు నో ఛాన్స్.. బీసీసీఐని బజారుకు ఈడ్చిన అంబటి రాయుడు !
మాట్లాడడంలో కూడా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. తన మాటలతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న వినోద్ కాంబ్లీ.. ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాడని తెలిస్తే అభిమానులు బాధపడతారని అన్నారు ఆయన సోదరుడు. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో వీరేంద్ర కాంబ్లీ మాట్లాడుతూ.. “వినోద్ కాంబ్లీ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నాడు. కానీ మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. వినోద్ కాంబ్లీకి ఇంకా చికిత్స కొనసాగుతుంది. అతడు ఓ చాంపియన్. తప్పకుండా తిరిగి వస్తాడు. మళ్లీ మైదానంలో పరిగెడతాడనే నమ్మకం నాకు ఉంది.
మీ అందరి ప్రేమ, మద్దతు వినోద్ కి అవసరం. మీరు అతన్ని మళ్లీ మైదానంలో చూడాలని నేను కోరుకుంటున్నాను. వినోద్ పది రోజులపాటు పునరావాసం పొందారు. మెదడు స్కాన్, మూత్ర పరీక్షతో సహా అతడి మొత్తం శరీరాన్ని పరీక్షించారు. పెద్దగా సమస్యలు ఏవి తేలలేదు. కానీ అతడు నడవలేకపోతున్నాడు. అతడికి ఫిజియోథెరపీ సూచించారు. అతడి మాటలు ఇంకా స్పష్టంగా తెలియకపోయినా.. అతడి పరిస్థితి మెరుగుపడుతుంది. అతడు త్వరగా కోలుకోవడానికి ప్రజలు అతడి కోసం ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. ” అంటూ వినోద్ సోదరుడు వీరేంద్ర చెప్పుకొచ్చాడు.
వినోద్ కాంబ్లీ గత దశాబ్ద కాలంగా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. 2013లో రెండు గుండె ఆపరేషన్లు జరిగాయి. అప్పుడు సచిన్ టెండుల్కర్ ఆర్థిక సహాయం అందించాడు. అంతేకాకుండా ఆల్కహాల్ వ్యసనం, డిప్రెషన్ వంటి సమస్యలతో 14 సార్లు రిహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్ళినట్లు ఆయన సన్నిహితుడు వెల్లడించాడు. ఇక గత ఏడాది డిసెంబర్ 21న కాంబ్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. యూరినరీ ఇన్ఫెక్షన్, కండరాల నొప్పులతో థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేరాడు.
Also Read: Kohli’s son: కోహ్లీ కొడుకు పుట్టిన గడియపై రచ్చ.. RCB ప్లేయర్ల జట్లే ఛాంపియన్స్
వైద్య పరీక్షలలో ఆయన మెదడులో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. దాదాపు పది రోజుల చికిత్స అనంతరం జనవరి 1న ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అప్పటినుండి బాంద్రాలోని తన నివాసంలోనే ఉంటూ ఫిజియోథెరపీ తీసుకుంటున్నాడు. కాంబ్లీ ఆరోగ్యం గురించి ఆయన సోదరుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కలవరపడుతున్నారు. అతడు నడవడానికి, మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడనే వ్యాఖ్యలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో అతడు త్వరగా కోలుకోవాలని, మళ్లీ ఆరోగ్యంగా కనిపించాలని అభిమానులు, క్రికెట్ సమాజం కోరుకుంటుంది.
🙏 Prayers for Vinod Kambli 🙏
Once hailed as Indian cricket’s brightest talent and Sachin’s childhood friend, Vinod Kambli (53) is now battling serious health and financial struggles.
His brother Virendra has urged fans to keep him in their prayers as he fights speech and… pic.twitter.com/557xSPxe5P
— Yola Cricket (@Yolacricket) August 21, 2025