BigTV English

Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు

Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు

Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును తిరగరాశాడు. ప్రస్తుతం టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉన్నది. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. శ్రీలంకపై ఈ రోజు మూడు సిక్సర్లు బాది ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను వెనక్కి నెట్టేశాడు.


కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన వారి జాబితా ఇలా ఉన్నది. 234 సిక్సర్లతో రోహిత్ ప్రథమ స్థానంలో ఉండగా.. 233 సిక్సర్లతో మోర్గాన్ రెండో ప్లేస్‌లో ఉన్నాడు. ఆ తర్వాత 211 సిక్సర్లతో ఎంఎస్ ధోని, 171 సిక్సర్లతో రిక్కీ పాంటింగ్, బ్రెండన్ మెక్‌కల్లం 170 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నారు.

Also Read: Olympic: మను భాకర్ కోచ్‌కు షాక్.. ఇంటిని కూల్చేస్తామని నోటీసు


కెప్టెన్‌గా కాకుండా ఓవరాల్‌గా వన్డేలో సిక్సర్లు బాదిన వారి జాబితాలోనూ హిట్‌మ్యాన్ మంచి ప్లేస్‌లోనే ఉన్నాడు. అంతర్జాతీయ వన్డే మ్యాచు‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్‌మెన్‌గా పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ అఫ్రీదీ ఉన్నాడు. అఫ్రీది 351 సిక్స్‌లు కొట్టాడు. రెండో స్థానంలో 331 సిక్సర్లతో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఉన్నాడు. రోహిత్ శర్మ కౌంట్ 326 గా ఉన్నది. మరో ఆరు సిక్స్‌లు కొడితే క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి త్వరలోనే రోహిత్ శర్మ చేరే అవకాశాలున్నాయి.

ఇక మూడు ఫార్మాట్‌లలో కలిపి అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మ టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మాట్‌లలో కలిపి 612 సిక్స్‌లు బాదాడు. ఆ తర్వాత 553 సిక్సర్లతో క్రిస్ గేల్ ఉన్నాడు. 476 సిక్స్‌లతో షాహిద్ అఫ్రిది మూడో స్థానంలో నిలిచాడు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×