Big Stories

Sanju Samson: సంజూ.. నీకిది తగదు.. జోస్ బట్లర్ ని విమర్శిస్తావా? నెట్టింట ఫైర్

Captain Sanju Samson’s comments on Jos Buttler kkr vs RR IPL 2024: రాజస్థాన్ రాయల్స్ గెలిచేందుకు శాయశక్తులా కృషి చేసిన జోస్ బట్లర్ ని చిన్నచూపు చూస్తూ కెప్టెన్ సంజూ శాంసన్ చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సంజూని అందరూ తిట్టిపోస్తున్నారు. నువ్వు నాయకుడివా? లేక ముఠా నాయకుడివా? జట్టులో ముఠాలు కడుతున్నావెందుకు? అని ఒక రేంజ్ లో వేసుకుంటున్నారు.

- Advertisement -

ఇంతకీ తనేమన్నాడంటే, రాజస్థాన్ గెలిచింది. జోస్ బట్లర్ వల్ల కాదు. రోవ్ మన్ పోవెల్ వల్ల గెలిచిందని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ చేజారిపోతున్న దశలో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. దీంతో మాకు టెన్షన్ తగ్గింది. కోల్ కతా కు పెరిగిందని అన్నాడు. అక్కడే మ్యాచ్ మా వైపునకు టర్న్ అయ్యిందని అన్నాడు. ఆ రెండు సిక్సర్లు లేకపోతే, జోస్ బట్లర్ ఎంత ఆడినా ఫలితం ఉండకపోయేదని తేల్చి చెప్పాడు.

- Advertisement -
Captain Sanju Samson's comments on Jos Buttler kkr
Captain Sanju Samson’s comments on Jos Buttler kkr

దీంతో నెట్టింట నిప్పు రాజుకుంది. నీకు రోవ్ మన్ పోవెల్ మీద అభిమానం ఉంటే,  అభినందించు తప్పు లేదు, అంతేకానీ చివరి వరకు వీరోచితంగా ఆడి గెలిపించిన జోస్ బట్లర్ ని తక్కువ చేసి మాట్లాడటం నాయకత్వ లక్షణం కాదు, రేపు జట్టులో అభద్రతా భావం వస్తుంది చూస్కోమని హెచ్చరిస్తున్నారు.

Also Read: అబ్బో.. సునీల్ నరైన్ వెంట ఎన్ని రికార్డులో..

ఒక కెప్టెన్ మెచ్చుకో లేకపోతే జోస్ బట్లర్ రేపటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో ఎలా ఆడతాడని ప్రశ్నిస్తున్నారు. అతని ఉత్సాహం మీద నీళ్లు జల్లావు, నువ్వు ఒక కెప్టెన్ వేనా? అని కడిగి పారేస్తున్నారు. అందరూ ఆడుతున్నారు కాబట్టి, నీ జట్టు గెలుస్తుంది, నీ వల్ల కాదు గుర్తెట్టుకో అని గట్టిగానే వార్నింగులు ఇస్తున్నారు.

కొంతమంది ఏమంటున్నారంటే, తను జోస్ బట్లర్ ని కించపరచలేదు. తను ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్ లని గెలిపించాడు. తను చివరి వరకు ఉంటే, విజయంపై మాకెటువంటి అపనమ్మకం కూడా లేదని సంజూ అన్నాడని కొందరు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా తను అన్నమాటలు కంటితుడుపుగానే ఉన్నాయని కొందరు వ్యాక్యానిస్తున్నారు.

మొత్తానికి బ్రహ్మాండంగా ఆడుతున్న రాజస్థాన్ జట్టులో సంజూ లేనిపోని సమస్యలు క్రియేట్ చేశాడని మరికొందరు వ్యాక్యానిస్తున్నారు. ఇది రేపటి నుంచి ఎటువంటి ఫలితాలను చూపిస్తోందనని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News