BigTV English

Brahmamudi Serial Today February 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ కు ఉరిశిక్ష పడేలా చేస్తానన్న అనామిక – అనామికకు వార్నింగ్‌ ఇచ్చిన సుభాష్‌  

Brahmamudi Serial Today February 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ కు ఉరిశిక్ష పడేలా చేస్తానన్న అనామిక – అనామికకు వార్నింగ్‌ ఇచ్చిన సుభాష్‌  

Brahmamudi serial today Episode: అప్పు, రాజ్‌ను అరెస్ట్‌ చేసి తీసుకెళ్తుంటే అనామిక కోపంగా నిన్ను ఉరికంభం ఎక్కించేంత వరకు వదలను అంటుంది. మీడియా వాళ్లు రాజ్‌ను ఏవేవో ప్రశ్నలు వేసి విసిగిస్తారు. మీరు ఇది కావాలనే చేశారా..? అని అడుగుతారు. అప్పు అందరిని పక్కకు తప్పించి రాజ్‌ను తీసుకుని వెళ్లిపోతుంది. అందరూ ఏడుస్తుంటారు. కావ్య ఏడుస్తుంది. సుభాస్‌ వచ్చి కావ్య నువ్వు బాధపడకు నేను లాయర్‌తో మాట్లాడతాను అని చెప్తాడు.


తర్వాత స్వప్న, కనకానికి ఫోన్‌ చేస్తుంది. ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన కనకం అబ్బో నువ్వు ఫోన్‌ చేశావేంటో.. ఇవాళ వాన పడుతుందేమో.. అంటుంది. నీకు అక్కడ వాన పడుతుందేమో.. కానీ మాకు ఇక్కడ తుఫాన్‌ వచ్చి అందరం కొట్టుకుపోయేలా ఉన్నాము అంటుంది స్వప్న. అంత దారుణం ఏం జరిగిందే అని కనకం అడుగుతుంది. నీ ముద్దుల మూడో కూతురు ఇంటికి వచ్చి రాజ్‌ను అరెస్ట్‌ చేసింది. సామంత్‌ను చంపినందుకు రాజ్‌ను అరెస్ట్‌ చేసింది. ఆ సామంత్‌ శవం రాజ్‌ కారులోనే దొరికింది. పాపం అప్పు కూడా ఏం చేయలేక అరెస్ట్ చేయాల్సి వచ్చింది. కావ్య కూడా ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తుంది అని చెప్తుంది. అయ్యో అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటే ఏంటే మళ్లీ ఇలా జరిగింది అంటూ కనకం కంగారుపడుతుంది. నేను ఇప్పుడే బయలుదేరి అక్కడకు వస్తున్నాను అని కనకం అనగానే.. వద్దులే అమ్మా ఇక్కడ అందరూ అప్పు మీద కోపంగా ఉన్నారు.. నువ్వు వస్తే నిన్ను తిడతారు ఇక్కడ అతా కూల్‌ అయ్యాక ఫోన్‌ చేస్తాను అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది స్వప్న.

సుభాష్‌, కావ్య ఇద్దరూ కలిసి రాజ్‌ను కలవడానికి స్టేషన్‌కు వెళ్తారు. ఎస్సైని కలవాలని కానిస్టేబుల్‌ను అడగ్గానే.. లోపల ఇన్వెస్టిగేషన్‌ జరుగుతుంది అక్కడ కూర్చోండి అని చెప్తుంది. లోపల అప్పు రాజ్‌ను ప్రశ్నిస్తుంది. మీరు ఒక్కరే రాత్రి పూట కారేసుకుని బయటకు వెళ్లారని మీ వైఫ్‌ చెప్పారు మీరు ఎక్కడికి వెళ్లారు అని అప్పు అడుగుతుంది. మేమందరం పార్టీ మూడ్‌లో ఉన్న టైంలో మా ఫ్యాక్టరీ సెక్యూరిటీ నుంచి కాల్‌ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సెక్యూరిటీని కొట్టి ఫ్యాక్టరీ తగులబెట్టాలని చూస్తున్నారు అని చెప్పాడు. ఆ టైంలో ఈ విషయం ఇంట్లో చెబితే అందరూ డిస్టర్బ్‌ అవుతారని ఎవరికీ చెప్పకుండా నేను ఒక్కడినే వెళ్లాను అని రాజ్‌ చెప్పగానే.. అప్పు.. ఎవరు? వాళ్లు.. ఎందుకు ఫ్యాక్టరీ తగులబెట్టాలనుకున్నారు అని అడుగుతుంది. తెలియదని రాజ్‌ చెప్తాడు. అది తెలుసుకుందామనే వాళ్లను పట్టుకుందామని చాలా ట్రై చేశాను కానీ తప్పించుకుని వెళ్లిపోయారు అని చెప్తాడు.


తర్వాత ఎక్కడికైనా వెళ్లారా… అని అప్పు అడిగితే ఎక్కడికి వెళ్లలేదని డైరెక్టుగా ఇంటికి వచ్చాను అని చెప్తాడు. మరి సామంత్‌ను మీరే చంపారని అనామిక కంఫ్టైంట్‌ ఎందుకు ఇచ్చింది ఆ మర్డర్‌ మీరే చేశారని అనుమానంగా ఉందని చెప్పింది అనగానే.. రాజ్‌ కోపంగా ఆ మర్డర్‌ నేను చేయలేదు. ఎవరో కావాలనే నన్ను ఇరికించారు ఫ్లీజ్‌ నన్ను నమ్మండి అని రాజ్‌ చెప్పగానే.. అందరికంటే ఎక్కువగా నమ్మేది నేనే బావా అని మనసులో అనుకుంటుంది అప్పు. తర్వాత బయటకు తీసుకొస్తుంది అప్పు. బయట కూర్చు్న్న కావ్య ఏడుస్తూ రాజ్‌ను చూస్తూ అప్పు ఏమైందే అని అడుగుతుంది. బావ ఈ హత్య చేయలేదు అనడానికి ఒక్క సాక్ష్యం లేదక్కా.. ఒక్క చిన్న క్లూ ఉన్నా బాగుండేది అని చెప్పి వెళ్లిపోతుంది అప్పు.

కావ్య ఏడుస్తూ రాజ్‌ దగ్గరకు వెళ్లగానే.. మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని రాజ్‌ అడుగుతాడు. కావ్య ఏడుస్తూ మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి అక్కడ మేము అలా ఎలా ఉండగలం అనుకుంటున్నారు అంటుంది. సుభాష్‌ కూడా మీ మమ్మీ, తాతయ్య, నాన్నమ్మ అందరూ వస్తామన్నారురా కానీ మేమే రానివ్వలేదు అని చెప్తాడు. కావ్య.. అసలు ఏంటండి ఇదంతా ఏం జరుగుతుంది మన చుట్టు.. అని అడుగుతుంది. దీంతో రాజ్‌ ఎవరో కావాలనే నన్ను ఇరికించారన్నది నిజం కళావతి అంటాడు. కావ్య ఎవరై ఉంటారని అడుగుతుంది. ఇదంతా అనామిక పనే అని నా అనుమానం. సామంత్‌ కనిపించడం లేదని నేరుగా వచ్చి నా మీద కేసు పెట్టి పోలీసులను ఇంటికి తీసుకొచ్చింది.

శవం కనిపించగానే మీడియా వాళ్లు వచ్చారు. ఫ్రీ ఫ్లాన్డ్‌ కాకపోతే ఇవన్నీ క్షణాల మీద ఎలా జరిగిపోతాయి అని చెప్పగానే.. కావ్య.. అంటే మీరతన్ని కొట్టడం, చంపేస్తానని బెదిరించడం.. ఇవన్నీ సాక్ష్యాలుగా మార్చుకుని ప్లాన్‌ ప్రకారమే ఇదంతా చేసిందంటారా..? అంటే ఈ హత్య కూడా తనే చేసిందంటారా..? అని అడుగుతుంది. అదంతా ఎంక్వైరీలో తేలుతుంది. అని రాజ్‌ చెప్తుండగానే.. కానిస్టేబుల్‌ వచ్చి ఇంకా ఎక్కువ సేపు ఇక్కడ ఉండొద్దని చెప్పగానే కావ్య, సుభాష్‌ అక్కడి నుంచి వెళ్లిపోతారు. స్టేషన్‌లోంచి బయటకు వచ్చిన కావ్య, సుభాష్‌ బాధపడుతుంటే.. అనామిక వస్తుంది. ఏంటి అలా చూస్తున్నారు. కొంపదీసి నేనే ఇదంతా ప్లాన్‌ చేసి రాజ్‌ను ఇరికించానని అనుకుంటున్నారా ఏంటి..? అని అడుగుతుంది. అనుకోవడం ఏంటి..? నువ్వే చేశావని మాకు తెలుసు అంటుంది కావ్య. అసలు ఆ హత్య కూడా నువ్వే చేసి ఉంటావు అంటాడు సుభాష్‌. రాజ్‌కు ఉరిశిక్ష పడేవరకు నేను వదిలిపెట్టను అంటూ అనామిక వెళ్లిపోతుంది.

ఇంట్లో అందరూ బాధపడుతూ కూర్చుని ఉంటారు. ఇంతలో అప్పు ఇంటికి వస్తుంది. అప్పును చూసిన ధాన్యలక్ష్మీ కోపంగా ఈ ఇంటికి నిన్ను రప్పించడానికి మా రాజ్‌ ఎంతో కష్టపడ్డాడు.. అలాంటిది మా రాజ్‌నే అరెస్ట్‌ చేశావు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వచ్చావు. ఏ తప్పు చేయని రాజ్‌ను అరెస్ట్‌ చేస్తావా..? ఇందుకేనా నా కొడుకు నిన్ను పోలీస్‌ ను చేసింది అంటుంది. ఇంతలో రుద్రాణి కూడా అప్పును తిడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Intinti Ramayanam Serial Today September 25th: ‘ఇంటింటి రామాయణం’ సీరియల్‌: జాబ్‌ కు రిజైన్‌ చేసిన అక్షయ్‌

Illu Illalu Pillalu Serial Today September 25th: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: రామరాజు మీద పగ తీర్చుకుంటానన్న విశ్వ

Gunde Ninda Gudi Gantalu Serial Today September 25th: ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్‌: రోహిణిని అనుమానించిన బాలు    

Brahmamudi Serial Today September 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ను గల్లా పట్టుకుని నిలదీసిన కావ్య  

Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తోసేసిన మిస్సమ్మ

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Big Stories

×