SA VS NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి సెమీఫైనల్ పూర్తిగా ఇవాళ రెండో సెమీ ఫైనల్ జరగనుంది. ఈ రెండో సెమీఫైనల్ లో భాగంగా దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand vs South Africa ) మధ్య బిగ్ ఫైట్ ఉన్ననుంది. పాకిస్తాన్ లోని లాహోర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో… దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య… రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Also Read: NZ VS SA: నేడు రెండో సెమీస్.. పాకిస్థాన్ భారీ బ్లాస్ట్.. 9 మంది మృతి !
రెండో సెమీ ఫైనల్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి ?
చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో ( Champions Trophy 2025 tournament ) భాగంగా ఇవ్వాల జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రాంతంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్.. టాస్ ప్రక్రియ మధ్యాహ్నం రెండు గంటలకు ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు అన్ని… జియో హాట్ స్టార్ లోని ( Jo Hot Star) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లన్ని ఉచితంగానే ప్రసారం.. చేస్తోంది రిలయన్స్. జియో నెట్వర్క్ ఉన్న వారందరూ ఉచితంగా చూడవచ్చు. అలాగే ఈ టోర్నమెంట్ కు సంబంధించిన సెమీఫైనల్ మ్యాచ్ కూడా వస్తుంది. స్టార్ స్పోర్ట్స్ తో పాటు స్పోర్ట్స్ 18 లో కూడా చూడవచ్చు.
లాహోర్ గడాఫీలో వర్షం ఉంటుందా?
ప్రస్తుతం సమాచారం అందుతున్న ప్రకారం… లాహోర్ లో ఇవాళ వర్షం పడే అవకాశాలు లేనట్లు వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ఒకవేళ వర్షం పడిన… తొందరగానే తగ్గుతుందని చెబుతుంది వాతావరణ శాఖ. అయితే వర్షం పడి… మ్యాచ్ రద్దు అయితే రిజర్వ్డ్ డే కూడా ఉంది. మ్యాచ్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి తర్వాతి రోజున మ్యాచ్ ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్… 73 వన్డే మ్యాచ్లు జరిగాయి. ఇందులో సౌత్ ఆఫ్రికా కేవలం 42 మ్యాచ్లో విజయం సాధించింది. 26 మ్యాచ్లో మాత్రమే న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది. ఐదు మ్యాచ్ల్లో ఫలితం రాలేదు. ఈ లెక్కన న్యూజిలాండ్ పై సౌత్ ఆఫ్రికా గెలుస్తుందని అందరూ అంటున్నారు.
Also Read:IND VS AUS: దెబ్బకు దెబ్బ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కు చేరిన టీమిండియా
దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల అంచనా
దక్షిణాఫ్రికా ఆడుతున్న 11 (ప్రాబబుల్స్): టెంబా బావుమా (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి.
న్యూజిలాండ్ ఆడుతున్న 11 (ప్రాబబుల్స్): విల్ యంగ్, రచిన్ రవీంద్ర/డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (WK), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విల్ ఓర్‌కీసన్