BigTV English

IND vs BAN: బంగ్లా వర్సెస్ టీమిండియా రికార్డులు ఇవే.. రోహిత్ సేనను టచ్ చేయలేరు!

IND vs BAN: బంగ్లా వర్సెస్ టీమిండియా రికార్డులు ఇవే.. రోహిత్ సేనను టచ్ చేయలేరు!

IND vs BAN: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో నేడు తలపడనుంది. భారత్ – బంగ్లా జట్లు నేడు దుబాయ్ మైదానంలో పోటీ పడబోతున్నాయి. ఇరుజట్ల బలాబలాలు, ఫామ్ పరంగా చూసుకుంటే రోహిత్ సేన బంగ్లాదేశ్ కంటే ఎంతో బలంగా కనిపిస్తోంది. అయితే ఎప్పటిలాగానే బంగ్లాదేశ్ తమ స్థాయికి మించిన ప్రదర్శనను కనబరుస్తూ సంచలనాన్ని సృష్టిస్తుంది.


 

బ్యాటింగ్ తో పాటు స్పిన్ ప్రధాన బలంగా భారత్ రంగంలోకి దిగుతుండగా.. బంగ్లాదేశ్ తమ పేస్ బౌలింగ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. టీమ్ ఇండియా తుది జట్టుకూర్పు లో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగబోతుందని సమాచారం. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్ శుభారంభం అందిస్తే.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ దానిని కొనసాగిస్తాడు. ఇక ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ తో పాటు ఐదవ స్థానంలో బ్యాటింగ్ కి దిగే కే.ఎల్ రాహుల్ కూడా రాణిస్తే.. ఇక భారత జట్టుకు తిరుగుండదు.


అలాగే హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆల్ రౌండ్ నైపుణ్యం భారత జట్టుకు అదనపు బలంగా చెప్పవచ్చు. ఇక మరోవైపు బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ చాలా రోజులుగా మంచి ఆట తీరును కనబరుస్తున్నాడు. ఇక పేస్ విభాగంలో మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ ఉన్నారు. ఇక బంగ్లా.. షకీబ్ అల్ హసన్ లేకుండా తొలిసారి ఓ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడబోతోంది. మరోవైపు లిటన్ దాస్ కూడా ఈ మెగా టోర్నీలో లేడు. దీంతో సీనియర్లు ముష్బికర్, మహమ్మదుల్లా టీమ్ భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు యువ బ్యాటర్లలో తన్ జీత్, తౌహీద్ ఇటీవల పెద్దగా రాణించడం లేదు.

అలాగే కెప్టెన్ నజ్ముల్ చాలా కాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా జరిగే ఈ తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఎలాంటి ఆట తీరు కనబరుస్తుందో వేచి చూడాలి. ఇక భారత్ – బంగ్లాదేశ్ జట్లు వన్డే ఫార్మాట్ లో ఇప్పటివరకు 41 మ్యాచ్ లలో తలపడగా.. ఇందులో భరత్ దే పైచేయి గా ఉంది. ఈ 41 మ్యాచ్ లలో భారత్ 32 మ్యాచులలో గెలుపొందగా.. బంగ్లాదేశ్ 8 మ్యాచ్ లలో గెలుపొందింది. ఇందులో ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.

 

అలాగే ఈ 41 మ్యాచ్ లలో స్వదేశంలో భారత జట్టు నాలుగు సార్లు గెలుపొందగా.. బంగ్లాదేశ్ వారి స్వదేశంలో ఆరుసార్లు గెలిపొందింది. ఇక ఇతర దేశాలలో బంగ్లాదేశ్ గెలుపు శాతం సున్నా. అలాగే ఇతర దేశాలలో బంగ్లాదేశ్ పై భారత జట్టు 18 సార్లు గెలుపొందింది. ఇక బంగ్లాదేశ్ – భారత్ జట్లు 2007 నుండి ఐసీసీ వేదికలపై 11 సార్లు తలపడ్డాయి. ఇందులో బంగ్లాదేశ్ కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే గెలుపొందగా.. మిగిలిన 10 మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి క్రీడా వర్గాలు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×